జగన్ కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు: చంద్రబాబు

జగన్ కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు: చంద్రబాబు
x
Highlights

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు పార్టీలు కేంద్రం తీరుపై విమర్శలు...

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు పార్టీలు కేంద్రం తీరుపై విమర్శలు సంధింస్తున్నాయి. బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించపోవడంపై ఇప్పటికే ఆ రాష్ట్ర అధికార పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు, ఎంపీలు కూడా వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర సర్కార్ విమర్శులు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.

ఏపీకి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో జగన్‌ సర్కార్ విఫలమైందని చంద్రబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, అమరావతి, పోలవరానికి నిధులు లేవన్నారు. సీఎం జగన్‌ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రానికి అన్యాయం చెస్తున్నారని విమర్శించారు. జగన్ కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. 25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్‌.. 28మంది ఎంపీలను కేసుల మాఫీకి వాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories