ఇళ్ల పట్టాల ముసుగులో భారీ కుంభకోణం : చంద్రబాబు

ఇళ్ల పట్టాల ముసుగులో భారీ కుంభకోణం : చంద్రబాబు
x
TDP chief Chandrababu Naidu(File photo)
Highlights

వైసీపీ నేతలు కరోనా వైరస్ కూడా టీడీపీనే తెచ్చిందని అంటారేమోనని ఏపీ ప్రతిపక్షనేత, మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతలు కరోనా వైరస్ కూడా టీడీపీనే తెచ్చిందని అంటారేమోనని ఏపీ ప్రతిపక్షనేత, మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన్ తాత రాజారెడ్డి దారిలోనే నడుస్తున్నారని, తమ అరాచకాలకు అడ్డొచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు

ప్రభుత్వం తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే టీడీపీపై ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. ప్రజల దృష్టి మళ్లించడానికే నీటి పంపకాల అంశంలో సీఎం జగన్‌ నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కాళేశ్వరం పూర్తయితే రెండు రాష్ట్రాలు భారత్‌ - పాక్‌లా తయారవుతాయని దీక్షలు చేసిన అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రారంభానికి వెళ్లి టెంకాయ కొట్టి కేసీఆర్‌ను పొగిడారని గుర్తుచేశారు. ఇద్దరం కలిసి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడు జగన్‌ కొత్తగా నాటకాలాడుతున్నారని ఆరోపించారు.

ఇళ్ల పట్టాల ముసుగులో భారీ భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని చంద్రబాబూ ఆరోపించారు. మీడియాపై కూడా కక్ష సాధిస్తున్నారని, జగన్‌కు చట్టంపై గౌరవం, రాజ్యాంగంపై విశ్వాసం రెండూ లేవని విమర్శించారు.మాస్కులు అడిగినందుకు సస్పెండ్ చేసి, పిచ్చోడి ముద్రవేసి, నడిరోడ్డుపై తాళ్లతో కట్టి అరెస్ట్‌ చేశారని, విశాఖ వైద్యుడు సుధాకర్ ను పిచ్చివాడని ముద్ర వేశారని, ఎంతో కలచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా సంక్షోభంలో వైద్యులకు ప్రపంచమంతటా నీరాజనాలు పలుకుతున్నారని, దేశమంతా పూలు జల్లుతున్నారని గుర్తుచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories