ఎన్నికల కమిషనర్ తొలగింపుపై చంద్రబాబు సీరియస్

ఎన్నికల కమిషనర్ తొలగింపుపై చంద్రబాబు సీరియస్
x
Chandrababu (File Photo)
Highlights

స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి మధ్యలో ఎన్నికల కమిషనర్ ఎలా మారుస్తారని టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి మధ్యలో ఎన్నికల కమిషనర్ ఎలా మారుస్తారని టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.ఎన్నికల కమిషనర్ నిమ్మ‌గ‌డ్డ పదవీకాలం కుదింపు ఆర్డినెన్సు పై గవర్నర్ బిశ్వ‌భూష‌న్ కు చంద్రబాబు లేఖ రాశారు.

కొత్త కమిషనర్ నియామకం కోసం తెచ్చిన ఆర్డినెన్సు నిలిపివేయాల‌ని డిమాండ్ చేశారు. ఐదేళ్ల పదవీకాలానికై 2016 జనవరి 31 న నిమ్మగడ రమేష్ కుమార్ నియమితులయ్యార‌ని, ఆయన పదవీకాలం పూర్తయ్యాకే కొత్త ఆర్డినెన్స్ ని తేవాల‌ని చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

కాగా.. ఏపీ సీఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్సు పై సీపీఐ రామకృష్ణ విమ‌ర్శించారు. ఆర్డినెన్స్ తీసుకురావడం స‌రైంది కాద‌ని, క‌క్ష‌పూరిత వ్య‌వ‌హ‌రించ‌డం తగవని విమర్శించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జ‌రిగితే..'కరోనా' విపత్తు వల్ల జరిగే ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి ఎస్ఈసీ ఎన్నిక‌లు వాయిదా వేశారని అన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు.

మరోవైపు.. రాష్ట్రంలో నియంతృత్వ పాలన న‌డుస్తోందని, మూడు రాజ‌ధానుల బిల్లు సెల‌క్ట్ క‌మిటీకి పంపార‌ని మండలినే రద్దు చేశారని ఆరోపించారు. తాజా పరిణామాలపై తాను గవర్నర్ కు లేఖ రాస్తున్నానని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories