ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దారుణం.. వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు ఫైర్

ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దారుణం.. వైసీపీ ప్రభుత్వం పై చంద్రబాబు ఫైర్
x
Chandrababu Naidu(File Photo)
Highlights

దేశవ్యాప్తంగా ఈరోజు(సోమవారం)నుంచి మూడో విడత లాక్ డౌన్ నడుస్తోంది.

దేశవ్యాప్తంగా ఈరోజు(సోమవారం)నుంచి మూడో విడత లాక్ డౌన్ నడుస్తోంది. దీనితో ఏపీలో మద్యంషాపులకి వైసీపీ ప్రభుత్వం అనుమతివ్వడంతో లిక్కర్ షాపుల ముందు మందుబాబులు ఎండలను కూడా లెక్క చేయకుండా బారులుదీరుతున్నారు. కనీసం సామాజిక దూరం పాటించడంలేదు.. మరికొన్ని చోట్లల్లో మద్యం షాపులు లేటుగా తెరిచినందుకు గాను మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మద్యం దుకాణాలు తెరవబోతున్నట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.

తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఒకపక్కా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయం దారుణమని మండిపడ్డారు. మద్యం దుకాణాలు తీస్తే జనంగా భారీగా గుమిగూడతారన్న ఇంగిత జ్ఞానం అందరికీ ఉంటుంది. ఇలాంటి క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా ఈ రోజు ఇలా భారీ సంఖ్యలో జనం క్యూలు కట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దారుణం అన్నారు.

మద్యం అమ్మకాలకు సంబంధించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని మార్గనిర్దేశకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.. మద్యం దుకాణాల వద్ద ఆరడుగుల దూరం పాటించాలనే నిబంధనని పెట్టాయి. అంతేకాకుండా ప్రతి మనిషి, మనిషికి మధ్య 2 గజాలు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇక వైన్ షాపుల వద్దకి ఒక్కసారి అయిదుగురికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఇక అటు లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో మధ్యం, పాన్, గుట్కా, పొగాకు బహిరంగ ప్రదేశాలలో వినియోగించరాదని వెల్లడించింది. ఎవరైనా చర్యలను పాటించకపోతే కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories