కరోనా వైరస్ కేవలం జ్వరం అంటారా.. సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టారు. జగన్ వ్యాఖ్యలు అయన నిర్లక్ష్యంనికి నిదర్శనం అని అన్నారు. ఈ మేరకు జగన్ మాట్లాడిన వీడియోను బాబు ట్వీట్ చేశారు. ఈ సంద్భంగా కరోనా వైరస్ కేవలం జ్వరమేనని ప్రతిసారి చెప్పే వ్యక్తుల గురించి ఏం మాట్లాడాలని చంద్రబాబు అన్నారు. ఇదంతా సీఎం నిర్లక్ష్యానికి నిదర్శమని వైరస్ కేసుల్లో సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని తెలుస్తోందని పేర్కన్నారు. ఇక రాష్ట్రాన్ని దేవుడు రక్షించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు
అంతకుముందు మీడియాతో మాట్లాడిన సీఎం జగన్.. కరోనా బాధితులను అంటరానివారిగా చూడొద్దని సీఎం జగన్ అన్నారు. కరోనా నాతో సహా ఎవరికైనా రావచ్చుని, రాబోయే కాలంలో ప్రజలు కరోనా కలిసి జీవించాల్సి ఉంటుంది. ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, కరోనాపై అనవసర భయాలు పెట్టుకోవద్దు అన్నారు. కరోనా ఒక జ్వరం లాంటిది అన్నారు. ఎవరికి వస్తుందో తెలియడం కష్టమన్నారు. సామాజిక దూరం పాటించడం అవసరం. రాష్ట్రంలోని గ్రీన్ జోన్స్ ప్రాంతాలలో కరోనా రాకుండా జాగ్రత్త పడాల్సి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అయితే సీఎం అన్న ఈ వ్యాఖ్యలను జోడిస్తూ సీఎం తీరును చంద్రబాబు తప్పుబట్టారు.
What can I say about a man who keeps repeating #Coronavirus is just a fever? It is because of his sheer carelessness that AP now tops the charts in South India. Truly appalled at his foolish comments about making #Covid-19 an integral part of everybody's lives. God save AP! pic.twitter.com/XIpBQSROhR
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 27, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



