Chandrababu: ప్ర‌భుత్వం ఇలా అప్పులు చేస్తే..రాష్ట్రం దివాళా తీస్తుంది

Chandrababu: ప్ర‌భుత్వం ఇలా అప్పులు చేస్తే..రాష్ట్రం దివాళా తీస్తుంది
x
Highlights

Chandrababu: రాజ‌కీయ క‌క్ష సాధింపులు తాను ఎప్పుడు చేయ‌లేద‌ని టీడీపీ అధినేత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు అన్నారు.

Chandrababu: రాజ‌కీయ క‌క్ష సాధింపులు తాను ఎప్పుడు చేయ‌లేద‌ని టీడీపీ అధినేత ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు అన్నారు. టీడీపీ మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ఆయ‌న ఈ రోజు వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడారు. భార‌త్ లో ఐటీ రంగ అభివృద్ధికి ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించి చెప్పాను. మైక్రోసాఫ్ట్ బ్రాంచ్‌ను హైద‌రాబాద్‌లో పెట్టాల‌ని కోరాను. మైక్రోసాఫ్ట్ హైద‌రాబాద్‌కు వ‌స్తే ప్ర‌పంచంలోని అనేక ఐటీ కంపెనీలు అక్క‌డ‌కు వ‌స్తాయ‌ని భావించాను. అనంత‌రం అదే జ‌రిగింది. నేడు అనేక ఐటీ కంపెనీలు హైద‌రాబాద్‌లో ఉన్నాయి' అని చంద్ర‌బాబునాయుడు అన్నారు.

'ఐటీని ప్ర‌మోట్ చేయాల‌ని ఆనాడు హైటెక్ సిటీకి రూప‌క‌ల్ప‌న చేశాను. అమెరికాలో తిరిగి భార‌త్‌కు రావాల‌ని ఐటీ కంపెనీల‌ను కోరాను. మైక్రోసాఫ్ట్ ప్ర‌తినిధుల‌తో మాట్లాడాను' అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు. 'ఇలా చేసుకుంటూ పోతే భ‌విష్య‌త్తులో అప్పులు ఇచ్చే వారు కూడా క‌ర‌వైపోతారు రాష్ట్రం దివాళా తీస్తుంది. ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మైనా సంప‌ద సృష్టించాలి. ఆ సంప‌ద‌తో ప‌థ‌కాల‌ను కొన‌సాగించాలి. కానీ ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటువంటి ప‌ని చేయ‌ట్లేదు. అప్పులు చేసుకుంటూ వెళ్తోంది' అని చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించారు.

హైద‌రాబాద్‌లో ఇంజ‌నీరింగ్ కాలేజీలు పెరిగాయి. నేను చేసిన ప‌ని నాకు తృప్తినిచ్చింది. ఆర్థిక అస‌మాన‌త‌ల‌ను తొల‌గించుకుంటూ పోవాలి. అంతేగానీ, ఇష్ట ప్ర‌కారం చేసుకుంటూ పోతానంటే అభివృద్ధి జ‌ర‌గ‌దు.. ఆంధ్రప్ర‌దేశ్‌లో ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితులే కొన‌సాగుతున్నాయి.. అప్పులు చేసుకుంటూ పోతున్నారు' అని చంద్ర‌బాబునాయుడు అన్నారు. హైద‌రాబాద్‌లో అభివృద్ధిని ఎప్పుడు చూసినా నాకు చాలా సంతృప్తి క‌లుగుతోంది. నా వ‌ల్ల వ‌చ్చిన కంపెనీల వల్ల నేను చాలా సంతృప్తి చెందుతున్నాను' అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories