విశాఖ వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వ‌లేదు : చంద్రబాబు

విశాఖ వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వ‌లేదు : చంద్రబాబు
x
Chandrababu Naidu(File photo)
Highlights

విశాఖలోని ఆర్.ఆర్. వెంకటాపురం సమీపంలోని ఎల్‌జీ పాలిమర్స్ స్టైరిన్ లీకేజీ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాల‌కు టీడీపీ నాయకులు నివాళులర్పించారు.

విశాఖలోని ఆర్.ఆర్. వెంకటాపురం సమీపంలోని ఎల్‌జీ పాలిమర్స్ స్టైరిన్ లీకేజీ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాల‌కు టీడీపీ నాయకులు నివాళులర్పించారు.మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మహానాడు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ప‌లువురు నాయకులు విశాఖ ద‌ర్ఘ‌ట‌న‌లో మృతి చెందిన వారికి రెండు నిమిషాల మౌనం పాటించి నివాళుల‌ర్పించారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు టీడీపీ అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. పార్టీ తరఫున చంద్రబాబు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్ర‌బాబు‌.. విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన గురించి తెలిసినప్పుడు చాలా బాధపడ్డానని, కానీ లాక్‌ డౌన్ వల్ల విశాఖ వెల్ల‌లేక‌పోయాయ‌ని చెప్పారు. గ్యాస్ లీక్‌ దుర్ఘటన జరగ్గానే విశాఖ వెళ్లేందుకు కేంద్రాన్ని అనుమ‌తి కోరానని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరాన‌ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇవ్వ‌నందునే విశాఖ వెళ్ల‌లేక‌పోయాన‌ని చెప్పారు. బాధితులకు అండగా నిలబడ్డ ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.

ఇప్పటి వరకు స్టైరీన్ గ్యాస్ తీవ్రతపై శాస్త్రీయ పరిజ్ఞానం లేదని చంద్రబాబు అన్నారు. రంగ‌నాయ‌క‌మ్మ విష‌య‌మై ప్ర‌స్తావించారు. బాధితులకు న్యాయం చేయాలని త‌న అభిప్రాయ‌న్ని సోష‌ల్ మీడియాలో చెప్పిన‌ రంగనాయకమ్మ, తదితరులపై కేసులు పెట్టడం అమానుషమని చంద్రబాబు మండిప‌డ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories