అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం

అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం
x
Highlights

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకే వర్గానికి చెందిన వ్యక్తులు రెండు గ్రూపులుగా...

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకే వర్గానికి చెందిన వ్యక్తులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర నిందారోపణలు చేసుకుంటున్నారు. పోలీసులు, అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తుండగా.. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ నేతలు అసత్య అరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నారు. బుక్కరాయ సముద్రం ఎమ్మార్వో కార్యాలయలయం ఎదుట టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న సమస్యను కులాల మద్య రగడలా మారుస్తున్నారని వైసీపీ వర్గీయులు విమర్శించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories