Top
logo

జమ్మలమడుగులో వైసీపీ కార్యకర్తపై దాడి.. తలకు తీవ్ర గాయాలు..

జమ్మలమడుగులో వైసీపీ కార్యకర్తపై దాడి.. తలకు తీవ్ర గాయాలు..
Highlights

కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీకి ఓటు వేస్తున్నారన్న కోపంతో...

కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీకి ఓటు వేస్తున్నారన్న కోపంతో టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తపై దాడి చేశారు. దీంతో అతనికి తల పగిలింది. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఘటనాస్థలికి చేరుకొని టీడీపీ కార్యకర్తల వెంటపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


లైవ్ టీవి


Share it
Top