నేడు టీడీఎల్పీ సమావేశం.. మరోవైపు చర్చలు..

నేడు టీడీఎల్పీ సమావేశం.. మరోవైపు చర్చలు..
x
Highlights

రేపటినుంచి మరోదఫా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో నేడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి...

రేపటినుంచి మరోదఫా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో నేడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రావలసిందిగా పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సబ్యులకు సమాచారం అందించారు పార్టీ నేతలు.ఉదయం 10 గంటల తరువాత టీడీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి ఎంత మంది వస్తారో అన్న అనుమానం టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. శనివారం ఉదయం నుంచే టీడీపీ ఎమ్మెల్సీలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు.

అసంతృప్తి నేతల్ని ఫోనులు బుజ్జగిస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది టీడీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. శాసనమండలిని రద్దు చేసే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తుండటంతో సభ్యుల్లో అలజడి రేగుతోంది. కొంతమందికి ఏడాది కూడా పూర్తి కాలేదు. దాంతో వారిలో అంతర్మధనం మొదలైనట్టు టాక్ వినబడుతోంది. ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్సీలు ప్రభుత్వంతో మధ్యవర్తి ద్వారా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి టీడీపీలోనే ఉంటూ.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా పనిచేస్తామని.. మండలిని రద్దు చెయ్యొద్దని ప్రభుత్వానికి సంకేతాలు పంపుతున్నారు. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం అలాంటి ప్రతిపాదనకు నో చెబుతున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు టీడీపీ సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు శనివారమంతా టీడీపీ కార్యాలయంలోనే ఉండి.. ఎమ్మెల్సీలందరితో ఫోన్లో మాట్లాడారు. టీడీఎల్పీ సమావేశానికి తప్పకుండా రావాలని ఎమ్మెల్సీలకు సూచించారు. అయితే నలుగురు ఎమ్మెల్సీలు తాము టీడీఎల్పీ భేటీకి రాలేకపోతున్నామని సమాచారమిచ్చారు. మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడి వర్ధంతి ఉన్నందువల్ల ఆయన సతీమణి సమాచారమివ్వగా.. ఇటీవల చనిపోయిన తన సోదరికి సంబంధించి కార్యక్రమాలు ఉన్నందువల్ల రావడం లేదని కర్నూలుకు చెందిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, తన దగ్గరి బంధువుల వివాహ కార్యక్రమం వల్ల రావడం లేదని అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి.. విరోచనాల కారణంగా టీడీఎల్పీ సమావేశానికి రాలేనని విజయనగరం జిల్లాకు చెందిన శత్రుచర్ల విజయరామరాజు ముందుగానే సమాచారమిచ్చారు. అయితే వీరంతా సోమవారానికల్లా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటామని చెప్పినట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories