కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం ప్రారంభం

కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం ప్రారంభం
x
Highlights

కాసేపట్లో తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం సమావేశం కానుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మనగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం...

కాసేపట్లో తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం సమావేశం కానుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మనగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఆఫీసుకు చేరుకున్నారు. రేపు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ప్రధానంగా చర్చించనున్నారు. అయితే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు (వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్) లకు మాత్రం టీడీఎల్పీ సమాచారం అందించలేదు. టీడీఎల్పీ ఏర్పాట్లను ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పర్యవేక్షిస్తున్నారు.

టీడీఎల్పీ సమావేశం అనంతరం మధ్యాహ్నం ముఖ్యనేతలతో స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో రాజధాని మార్పును ఎలాగైనా అడ్డుకుని తీరాలనుకుంటున్న టీడీపీ తన తుది వ్యూహాన్ని ఖరారు చేసుకోవడానికి.. రాజధాని తరలింపు అంశాన్ని నేరుగా బిల్లులో పెట్టకుండా ఉండేలా వ్యూహాన్ని రచించనుంది. అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్కరు తప్పకుండా హాజరు కావాలంటూ విప్ జారీ చేసింది. విప్ పరిధిలోకి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ లను కూడా తీసుకువచ్చింది.

మండలిలో ప్రవేశపెట్టే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలని భావిస్తోంది టీడీపీ. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలు జరగకుండా ఉండేందుకు రేపు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది ఆ పార్టీ. మరోవైపు మండలి లో రాజధాని తరలింపు బిల్లును టీడీపీ అడ్డుకుంటుందని భావిస్తున్న వైసీపీ.. మండలిని తాత్కాలికంగా రద్దు చెయ్యాలన్న వ్యూహాన్ని రచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మండలిని ఇప్పటివరకు తాత్కాలికంగా రద్దు చేసిన సందర్భాలు లేవు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సభ్యులు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువమంది ఉన్నారన్న కారణంతో అప్పట్లో మండలి వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. కానీ 2007 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థను పునరుద్ధరించారు. ఒకవేళ ప్రస్తుత మండలి రద్దు అవుతే మాత్రం టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆ పార్టీకి ప్రస్తుతం 23 మంది సభ్యులు ఉన్నారు. వారంతా అనర్హులుగా పరిగణింపబడతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories