ఆగి ఉన్న లారీని ఢీకొన్న టాటా ఏస్ వాహనం.. 7 మృతి, 8 మంది పరిస్థితి విషమం...

TATA Ace vehicle Hits Lorry Killed 7 Members 8 Seriously Injured in Palnadu | Live News
x

ఆగి ఉన్న లారీని ఢీకొన్న టాటా ఏస్ వాహనం.. 7 మృతి, 8 మంది పరిస్థితి విషమం...

Highlights

Palnadu - Road Accident: ప్రమాదం సమయంలో వాహనంలో 38 మంది ప్రయాణికులు...

Palnadu - Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెంట చింతలలో లారీ-టాటాఎస్ వాహనం ఢీకొని ఏడుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృత దేహాలను అంబులెన్స్ లో గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై సమీర్ భాషా తన సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. శ్రీశైలం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో 38 మంది ప్రయాణికులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories