అత్తింటి వేదింపులకు గర్భిణి బలి

అత్తింటి వేదింపులకు గర్భిణి బలి
x
Highlights

పెళ్లయిన ఐదు నెలలకే గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేట గ్రామంలో చోటుచేసుకుంది. ...

పెళ్లయిన ఐదు నెలలకే గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేట గ్రామంలో చోటుచేసుకుంది. పాలనాయుడుపేటకు చెందిన పాల రామిరెడ్డితో పోతునాయుడుపేటకు చెందిన ఆబోతు లావణ్య(21)కు ఈ ఏడాది జూన్‌ 13న వివాహం జరిగింది. రామిరెడ్డి తండ్రి చిన్నప్పడే చనిపోవడంతో తల్లి పాల బోడెమ్మతో కలిసి ఉంటున్నారు. కొత్తలో సంతోషంగానే సాగిన వీరి జీవితం.. ఆ తరువాత గొడవలమయం అయింది. అత్తా, కోడలి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆ గొడవలు మరింత ముదిరాయి.

ఇటీవల రామిరెడ్డి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ నిమిత్తం కరీంనగర్‌కు వెళ్లిపోయాడు. ఈ సమయంలో అత్త బోడెమ్మ లావణ్యను ఇంకా ఎక్కువగా వేధింపులకు గురిచేసింది. ఈ విషయం భర్త రామిరెడ్డికి ఫోన్‌లో చెప్పినా పట్టించుకోకపోవడంతో లావణ్య తన తల్లి శార్వాణికి ఫోన్‌లో చెప్పింది. శార్వాణి కూడా అల్లుడికి ఫోన్ చేస్తే అతను నిర్లక్షంగా సమాధానం చెప్పాడు. దీంతో చేసేదేమి లేక కూతురికి సర్ది చెప్పింది ఆమె. అయితే ఇది జరిగిన రెండు రోజులకే లావణ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రస్తుతం ఆమె నెలల గర్భిణీ. లావణ్య తల్లి శార్వాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories