తూ.గో.జిల్లా కాకినాడలో కార్పొరేటర్ అనుమానాస్పద మృతి

X
Representational Image
Highlights
* గంగరాజునగర్‌లోని ఓ రోడ్డుపై కంపర రమేష్ మృతదేహం * అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఘటన * రమేష్ ది హత్యా? కారు ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు
Sandeep Eggoju12 Feb 2021 4:09 AM GMT
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ 9వ వార్డు కార్పొరేటర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. కాకినాడ రూరల్ గంగరాజునగర్‌లో రోడ్డుపై వైసీపీ నాయకుడు కంపర రమేష్ మృతదేహం లభ్యమైంది. వాహనదారుల సమాచారంతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. రాత్రి రెండున్నర గంటల సమయంలో ఘటన జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు రమేష్ ది హత్యా..? లేక కారు ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రికి రమేష్ మృతదేహాన్ని తరలించిన పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Web TitleSuspicious death of corporater in east Godavari district Kakinada
Next Story