Polavaram: పోలవరంపై కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Supreme Court Said to Go to AP High Court in Polavaram Case
x

Polavaram: పోలవరంపై కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Highlights

Polavaram: పోలవరం కేసులో ఏపీ హైకోర్టుకే వెళ్లాలన్న సుప్రీంకోర్టు

Polavaram: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఖర్చు భరించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారించింది. పోలవరం కేసులో ఏపీ హైకోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింద.

పోలవరం కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ 2019లో సుప్రీంకోర్టును కేంద్రం ఆశ్రయించింది. పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషన్‌ను ఏపీ హైకోర్టు నుంచి బదిలీ చేయాలని కేంద్రం తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీనికి నిరాకరించిన ధర్మాసనం హైకోర్టుకు వెళ్లాలని సూచించి పిటిషన్‌ను కొట్టివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories