ఏపీ పంచాయతీ ఎన్నికలు: సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి షాక్..

ఏపీ పంచాయతీ ఎన్నికలు:  సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి షాక్..
x
Highlights

ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని...

ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది.జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేశారని రోహత్గి కోర్టుకు విన్నవించారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. పోలీసులు వ్యాక్సిన్ భద్రతలో ఉన్నారని వివరించారు. రాష్ట్ర హైకోర్టు సింగిల్‌ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని రోహత్గి తెలిపారు. వ్యాక్సినేషన్‌ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు. కాగా..ఎన్నికల నిర్వహానకు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదలను విన్న న్యాయస్థానం ఎన్నికలు వాయిదా ఎన్నికల నిర్వహించాలని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories