ఏపీ ప్రభుత్వ వాదనకు ఒకే.. హైకోర్టు 'స్టే' ను ఎత్తివేసిన సుప్రీం..

ఏపీ ప్రభుత్వ వాదనకు ఒకే.. హైకోర్టు స్టే ను ఎత్తివేసిన సుప్రీం..
x
Highlights

సుప్రీంకోర్టులో రమేష్ ఆసుపత్రి యాజమాన్యాయానికి ఎదురుదెబ్బ తగిలింది. స్వర్ణ ప్యాలస్ అగ్నిప్రమాదంలో పదిమంది చనిపోయిన కేసులో దర్యాప్తుకు సుప్రీంకోర్టు ..

సుప్రీంకోర్టులో రమేష్ ఆసుపత్రి యాజమాన్యాయానికి ఎదురుదెబ్బ తగిలింది. స్వర్ణ ప్యాలస్ అగ్నిప్రమాదంలో పదిమంది చనిపోయిన కేసులో దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఒకే చెప్పింది.ఏపీ ప్రభుత్వ వాదనను సమర్ధించింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టే ను కొట్టివేసింది. ప్రమాద కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ నారీమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.

కాగా స్వర్ణ ప్యాలస్ ఘటనలో ఏపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే డాక్టర్ రమేష్ పారిపోయారు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల బహుమతి కూడా విజయవాడ పోలీసులు ప్రకటించారు. ఇంతలో ఆసుపత్రి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.. దర్యాప్తు నిలిపివేయాల్సిందిగా కోరింది.. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డాక్టర్ రమేష్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దర్యాప్తు జరపవచ్చని సుప్రీం సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories