అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం

అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం
x
అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం
Highlights

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాకుళం అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమయ్యింది. సూర్యుని లేలేత కిరణాలు మూల విరాట్‌ను తాకాయి. ఉత్తర,...

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాకుళం అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమయ్యింది. సూర్యుని లేలేత కిరణాలు మూల విరాట్‌ను తాకాయి. ఉత్తర, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ఏడాదికి రెండు సార్లు కిరణ స్పర్శ జరగటం ఆనవాయితీ. మార్చి, అక్టోబర్ మాసాల్లో జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కిరణస్పర్శ సమయంలో భాస్కరుణ్ణి దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవ్వటంతో పాటు ఆర్ధిక కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అయితే ఈ సారి సుమారు ఎనిమిది నిమిషాల పాటు కిరణస్పర్శ జరగడంతో భక్తులు పరవసించిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories