Payakaraopeta: నిరంతర శ్రమతోనే విజయాలు సాధ్యం

Payakaraopeta: నిరంతర శ్రమతోనే విజయాలు సాధ్యం
x
Highlights

స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసేస్ డిగ్రీ కళాశాల నందు నిర్వహిస్తున్న క్రియేటివ్ క్లబ్ కార్యక్రమం గురువారం ముగిసింది.

పాయకరావుపేట: స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసేస్ డిగ్రీ కళాశాల నందు నిర్వహిస్తున్న క్రియేటివ్ క్లబ్ కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ... విద్యతో పాటు విద్యార్థులు ఇతర రంగాల నందు ప్రతిభ చూపించాలనే ఉద్దేశంతో... సంగీతం, డాన్స్, స్పాట్ పెయింటింగ్, డిబేట్, జస్ట్ ఏ మినిట్, క్విజ్, బృందగానంతో పాటుగా క్రీడల్లో విద్యార్థుల మధ్య పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపర్చుకోవచ్చని ఆయన తెలిపారు.

విజయం సాధించాలంటే నిరంతర శ్రమ, కృషి అవసరమని అన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా.కే..వీర్రాజు మాట్లాడుతూ... నేటి విద్యార్థులు మొబైల్ మోజులో తమ అమూల్యమైన కాలాన్ని వృథా చేస్తున్నారని... వాటిని విడనాడి నిర్ధిష్టమైన ప్రణాళికతో జీవితంలో ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపల్ ఎంవివిఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ పెనుగొడ సుబ్బారావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories