ప్రభుత్వ ఆదేశాలతో డిసెంబర్ 31 వరకు రాయితీ ఉల్లి అమ్మకాలు

ప్రభుత్వ ఆదేశాలతో డిసెంబర్ 31 వరకు రాయితీ ఉల్లి అమ్మకాలు
x
ఏఎమ్సి స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ వి సతీష్ కుమార్
Highlights

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 31 వరకు రాయితీపై ఉల్లిపాయల విక్రయ కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉంటుందని సెక్రెటరీ వి సతీష్ కుమార్ మీడియాకి తెలిపారు.

బొబ్బిలి: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 31 వరకు రాయితీపై ఉల్లిపాయల విక్రయ కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉంటుందని బొబ్బిలి ఏఎమ్సి స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ వి సతీష్ కుమార్ మీడియాకి తెలిపారు. ఈ రోజు బొబ్బిలి ఏ ఎమ్ సి కార్యాలయం ఆవరణంలో 2 కౌంటర్ల ద్వారా ఇంచుమించు 2 టన్నులు ఉల్లిని ప్రజలకు సబ్సిడీ ద్వారా ప్రజలకు అందించినట్టు తెలిపారు. ఇంచుమించు 1800 కుటుంబాలు ఈ రోజు సబ్సిడీ ఉల్లి కొనుగోలు చేసినట్టు తెలిపారు.

ప్రతి రోజు స్టాక్ సౌలభ్యం బట్టి ప్రతి కుటుంబానికి ఒక కేజీ ఉల్లిపాయలు 25 రూపాయలకే అందించనున్నట్టు తెలిపారు. ఉదయం 6:30 నుంచి స్టాక్ పూర్తి అయ్యేవరకు అమ్మకాలు కొనసాగుతాయని తెలిపారు. ఆధార్ లేదా రేషన్ కార్డు తీసుకురావాలని ప్రజలను కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories