దిశ అత్యాచారాన్ని నిరసిస్తూ విద్యార్థినీలు భారీ ర్యాలీ

దిశ అత్యాచారాన్ని నిరసిస్తూ విద్యార్థినీలు భారీ ర్యాలీ
x
ర్యాలీ చేస్తున్న విద్యార్థినిలు
Highlights

మండల కేంద్రంలో 9 వ తరగతి నుండి డిగ్రీ వరకూ గల సుమారు 1200 మంది విద్యార్థినీలు దిశ అత్యాచారాన్ని నిరసిస్తూ భారీగా ర్యాలీ నిర్వహించారు.

ఎస్.రాయవరం : మండల కేంద్రంలో 9 వ తరగతి నుండి డిగ్రీ వరకూ గల సుమారు 1200 మంది విద్యార్థినీలు దిశ అత్యాచారాన్ని నిరసిస్తూ పోలిసుల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. మహిళల పై అత్యాచారాలు ఆపాలంటూ నినదించారు. దిశ అత్యాచార నిందితులకు త్వరితగతిన కఠిన శిక్ష వేయాలని ముక్తకంఠంతో హోరెత్తారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సిపట్టణం ఏ ఎస్ప్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏ ఎస్ప్ మాట్లాడుతూ... మీ మీద దాడి జరిగినప్పుడు భయపడకుండా దైర్యంగా ఎదురు తిరిగి పోరాడాలని అన్నారు. అవలోచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని మీ తలంపుకి వచ్చిన వెంటనే 100 కి ఫోన్ చేయాలన్నారు. శక్తి వంతమైన పోలీస్ వ్యవస్థ మనకి ఉన్నది అని అన్నారు. మీరు టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసిన వెంటనే పోలీసులు స్పందించి మీకు సహాయం అందిస్తారని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories