Jaggampeta: కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ

జగ్గంపేట భాష్యం స్కూల్ విద్యార్థులచే కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

S. Srikanth
Published on: 22 Feb 2020 8:11 PM IST
Jaggampeta: కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ
X

జగ్గంపేట: జగ్గంపేట భాష్యం స్కూల్ విద్యార్థులచే కరోనా వైరస్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రజలకు కాచిన నీటిని తాగాలని, ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలని, సబ్బుతో చేతులను తరచుగా శుభ్రపరుచుకోవాలినే సూచించారు.

ఈ సందర్భంగా జగ్గంపేట నాలుగు రోడ్ల కూడలిలో కల జంక్షన్ నందు మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీలో జోనల్ ఇంచార్జ్ గోవిందరాజులు, పాఠశాల ప్రిన్సిపాల్ కె సత్యనారాయణ, ప్రైమరీ ప్రిన్సిపాల్ మహబూని, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story