విషాదాన్ని నింపిన చిన్నారుల ఆకతాయి చేష్టలు

విషాదాన్ని నింపిన చిన్నారుల ఆకతాయి చేష్టలు
x
Highlights

చిన్నారుల ఆకతాయి చేష్టలు విషాదాన్ని మిగిల్చాయి. పిల్లల సరదాపనులు ఆరేళ్ల బాలుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. పుంగనూరు ప్రాథమిక పాఠశాలలో ఇండిపెండెన్స్...

చిన్నారుల ఆకతాయి చేష్టలు విషాదాన్ని మిగిల్చాయి. పిల్లల సరదాపనులు ఆరేళ్ల బాలుడి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. పుంగనూరు ప్రాథమిక పాఠశాలలో ఇండిపెండెన్స్ డే రోజు జరిగిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకటో తరగతి చదువుతున్న హర్షవర్ధన్‌ బాత్‌రూంకి వెళ్లగా తోటి విద్యార్ధులు ఆటపట్టించేందుకు బయట తాళంవేసి వెళ్లిపోయారు. సరదాగా ఏడిపించాలని భావించినా పిల్లలు ఆ తర్వాత స్వాతంత్ర వేడుకల్లో నిమగ్నమైపోయి హర్షవర్థన్‌ సంగతి మరిచిపోయారు. దీంతో హర్షవర్థన్‌ దాదాపు మూడు గంటలపాటు బాత్‌రూంలోనే ఉండిపోయాడు.

వేడుకల సందడిలో హర్షవర్ధన్‌ కేకలు వేసిన బయటకు వినిపించలేదు. దీంతో బాగా ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడు పిల్లాడు. స్కూల్‌లో హడావుడి తగ్గిన తర్వాత బాత్‌రూం డోర్‌ ఒపెన్‌ చేయగా అప్పటికే స్పృహ కోల్పోయే స్థితిలో కనిపించాడు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందజేసి ఆస్పత్రికి తరలించారు. భయంతో తీవ్ర జర్వం తెచ్చుకున్న హర్షవర్ధన్‌ మూడ్రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బాబు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. టీచర్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు, బంధువులు స్కూల్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories