Top
logo

ప్రకాశం జిల్లాలో విషాదం.. నదిలో దూకి విద్యార్థిని ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలో విషాదం.. నదిలో దూకి విద్యార్థిని ఆత్మహత్య
X
Highlights

ప్రకాశం జిల్లాలో విషాదం.. నదిలో దూకి విద్యార్థిని ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుండ్లకమ్మ నది వంతెనపై నుంచి దూకి 9వ తరగతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు మోదేపల్లి గ్రామానికి చెందిన పాలెపోగు మార్తమ్మ కుమార్తె దేవి (15) గా గుర్తించారు. మృతిచెందిన బాలిక బీసీ హాస్టల్‌లో ఉంటూ ప్రకాశం ప్రభుత్వ బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఏమైందో ఏమో కానీ ఆదివారం మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ నదిపైన వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వంతెన దిమ్మెపై గాజులు, వాచీ మరి కొంత దూరంలో సూసైడ్‌ నోట్‌ దానిపై ఐదు రూపాయల నాణెం పెట్టి ఉండటాన్ని చూసిన మాజీ ఎస్సై సుబ్బరాజు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఒంగోలు నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రప్పించారు. అలాగే గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. కాగా సూసైడ్‌ నోట్‌ లో 'నేను ఎందుకంటే నెత్తురుతో రాసింది. నీవు నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి, నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా..' అని పేర్కొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియక దేవి తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది.

Next Story