వింత బాలుడు : పుట్టినప్పటి నుంచ అన్నం ముట్టని బాలుడు

వింత బాలుడు : పుట్టినప్పటి నుంచ అన్నం ముట్టని బాలుడు
x
Highlights

అన్నం తినకుండా ఎవరైనా ఎన్నిరోజులు ఉండగలుగుతారు ? మహా అయితే ఒక్కరోజు లేదా రెండ్రోజులు. మూడో రోజు వచ్చేసరికి నీరసమొచ్చి మంచానికి అతుక్కుపోతారు. కానీ పైన...

అన్నం తినకుండా ఎవరైనా ఎన్నిరోజులు ఉండగలుగుతారు ? మహా అయితే ఒక్కరోజు లేదా రెండ్రోజులు. మూడో రోజు వచ్చేసరికి నీరసమొచ్చి మంచానికి అతుక్కుపోతారు. కానీ పైన మీరు చూస్తున్న ఫొటోలో ఉన్న పిల్లాడు మాత్రం పుట్టినప్పటి నుంచి ఇంత వరకూ అన్నమే తినలేదట. అన్నం మెతుకే ముట్టని బాలుడు గురించి తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

ఇక్కడ కనిపిస్తున్న ఈ బాలుడు అన్నం తినమంటే ఆమడదూరం పరిగెడతాడు. కుర్‌కురేలు ఇస్తే కరకరలాడిస్తాడు తొమ్మిదేళ్లుగా అన్నం మెతుకే ముట్టలేదు. పుట్టినప్పటి నుంచి అన్నం అనేది తినకుండా కేవలం కుర్‌కురే, లేస్‌ లాంటి ప్యాకేజ్డ్‌ పదార్ధాలు, ఇడ్లీ, బోండా లాంటి తినుబండారాలు తిని కాలం నెట్టుకొస్తున్నాడు. ఎంతమంది డాక్టర్లుకు చూపించినా కొట్టినా, తిట్టినా తనకు ఇష్టమైన ఆహారం తీసుకుంటూ చలాకీగా కనిపిస్తున్నాడు.

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం సజ్జాపురం ఎస్సీ కాలనీకి చెందిన అనంతవరపు యాకోబు, ఏసమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు చార్లెస్‌. పదేళ్ళ వయసుగల ఈ బాలుడు ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. ఈ చిన్నోడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నం మెతుకు ముట్టలేదని కేవలం కుర్‌కురే ప్యాకెట్లు, బిస్కెట్లు వంటివి తింటూ మంచినీళ్లు తాగి సరిపెట్టుకుంటున్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు

పండుగ వచ్చినా ఇంట్లో భోజనం పెడతామని తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా అన్నం పళ్లెం పక్కకు నెట్టివేయటం కింద పడేయటం చేస్తుంటాడని బాలుడి తాత చెబుతున్నాడు. ఆదివారం వస్తే చికెన్‌తో అయినా భోజనం పెట్టాలని ప్రయత్నిస్తే రెండు చికెన్‌ ముక్కలు తినేసి భోజనం మాత్రం వద్దంటాడని చెప్పాడు. ఒకవేళ బలవంతంగా పెట్టినా వెంటనే వాంతి చేసేసుకుంటాడని చెబుతున్నాడు.

తనకు అన్నం అంటే ఇష్టం లేదని కుర్‌కురేలు ఇస్తే చాలని చిన్నోడు చార్లెస్‌ చెబుతున్నాడు. అమ్మానాన్న ఎన్నిసార్లు పెట్టాలని చూసినా ఇష్టం లేనిది తినబుద్ది కాలేదని అంటున్నాడు.

బాలుడి ఈ వింత ప్రవర్తనతో ఆందోళన చెందిన కుటుంబం అతడ్ని పలుమార్లు వైద్యులకు చూపించారు. వైద్యుల పర్యవేక్షణలో అన్నం పెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో బాలుడు ఎప్పటికైనా మారతాడులే అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ తినటం వల్ల బాలుడికి భవిష్యత్‌లో పోషకాహార లోపం కలిగే ప్రమాదం ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories