ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్..డైనమిక్ ఆఫీసర్ స్టీఫెన్

ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్..డైనమిక్ ఆఫీసర్ స్టీఫెన్
x
Highlights

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్‌కి కేంద్ర హోంశాఖ ఓకే చెప్పింది. రెండు, మూడు...

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్‌కి కేంద్ర హోంశాఖ ఓకే చెప్పింది. రెండు, మూడు రోజుల్లో స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ లెటర్‌ను కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి పంపనుంది. ఆ తర్వాత స్టీఫెన్‌ను ఏపీకి డిప్యూటేషన్‌పై పంపనుంది తెలంగాణ సర్కార్.

హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్‌ రవీంద్రకు కేంద్రంలో ఊరట లభించింది. స్టీఫెన్‌ను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా డిప్యూటీషన్‌పై వెళ్లడానికి కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలోనే తెలుగు రాష్ట్రాల సీఎంల పరస్పర ఒప్పందంతో డిప్యూటేషన్‌పై నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్రం ఆ ఫైల్‌ను పక్కనపెట్టింది. అప్పటి నుంచి స్టీఫెన్ రవీంద్ర లీవ్‌లో ఉన్నారు. అయితే, నెల రోజుల తర్వాత ఏపీకి వెళ్లేందుకు కేంద్రం ఓకే చెప్పింది.

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా అధికారం చేప్పట్టిన అనంతరం రాష్ట్రంలో కీలక అధికారుల నియామకం వేగంగా సాగుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల్లో కీలకమైన విభాగం ఇంటిలిజెన్స్ దీనికి తెలంగాణకు చెందిన స్టీఫెన్‌ రవీంద్రను నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

స్టీఫెన్ రవీంద్ర.. 1999లో వరంగల్ జిల్లా పరకాల ఏఎస్పీ గా మొదటి పోస్టింగ్‌లో చేరారు. 2004లో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. అదే ఏడాది డిసెంబరులో వరంగల్ జిల్లా ఎస్పీగా పనిచేసి మావోలపై ఉక్కుపాదం మోపుతూ అనేక ఎన్‌కౌంటర్‌లు చేశాడు. అలాంటి తరుణంలో అవినీతి అధికారులు, సిబ్బందిపైనా కొరడా ఝుళిపించారు. 2009లో కరీంనగర్ ఎస్పీగా పనిచేసి అందరి మన్ననలు అందుకున్నారు.

2010లో హైదరాబాద్‌లో వెస్ట్ జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన స్టీఫెన్ పబ్బులు, క్లబ్సుల్లో డ్రగ్ సరఫరా చేస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపారు. స్టీఫెన్ గతంలో కేంద్రం నుంచి అంగీకారం రాకపోవడంతో లీవ్ తీసుకున్నారు. మరి ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖను పంపనుంది. అయితే, ఆటంకాలన్నీ వైతొలగడంతో ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటారో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories