Top
logo

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు వార్నింగ్ ఇచ్చిన పోలీసు అధికారుల సంఘం

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు వార్నింగ్ ఇచ్చిన పోలీసు అధికారుల సంఘం
X
Highlights

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు వార్నింగ్ ఇచ్చిన పోలీసు అధికారుల సంఘం

టీడీపీ సీనియర్ నేత, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.. ఏపీ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌. పోలీసుల మీద అవాకులు చవాకులు పేలుతున్నారని.. వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 'పోలీసుల జాతకాలు నీ వద్ద ఉన్నాయని మాట్లాడుతున్నావ్‌.. నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది ఖబర్దార్‌' అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు పోలీసులు వారి డ్యూటీ వారు చేస్తున్నారన్న ఆయన.. పోలీసులపై ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, దూషించినా.. వారు ఏ పార్టీ అనేది చూడకుండా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి మస్తాన్‌ ఖాన్‌ కూడా వర్ల రామయ్యను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పబ్బం గడుపుకోడానికి కొందరు నాయకులు పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవని చెప్పారు. పోలీస్‌ వ్యవస్థ అనేది ప్రజలకోసం పనిచేస్తుందన్న ఆయన పోలీసులు ఎవరికీ తలొగ్గి పనిచేయరని పేర్కొన్నారురు. పోలీసులను కించపరిచేలా మాట్లాడటం కొందరికి ఫ్యాషన్‌ అయిపోయిందని ఎద్దేవా చేశారు.

Next Story