Tirumala: వైభవంగా శ్రీవారి చక్రస్నానం మహోత్సవం

Srivari Chakrasnanam Brahmotsavam in Tirumala
x

Tirumala: వైభవంగా శ్రీవారి చక్రస్నానం మహోత్సవం

Highlights

Tirumala: వరహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి.. సుగంధపరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది.‌ తెల్లవారు జామున శ్రీవారి మూలవిరాట్ కు ప్రాతకాల కైంకర్యాలు ముగిసాయి. అనంతరం గర్భాలయం నుండి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చి పల్లకిలో మాడావీధిలో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లారు .ఈ సందర్భంగా వరహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధపరిమళ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల నడుమ శుభముహుర్తంలో పుష్కరిణిలో చక్రాన్ని మూడుసార్లు ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories