Srisailam: భక్తుల రద్దీతో ఉచిత స్పర్శదర్శనం తాత్కాలికంగా నిలుపుదల

Srisailam:  భక్తుల రద్దీతో ఉచిత స్పర్శదర్శనం తాత్కాలికంగా నిలుపుదల
x

Srisailam: భక్తుల రద్దీతో ఉచిత స్పర్శదర్శనం తాత్కాలికంగా నిలుపుదల

Highlights

శ్రీశైలంలో భక్తుల భారీ రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. జలాశయం గేట్లు తెరుచుకున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా క్షేత్రంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ రద్దీ వచ్చే వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో జూలై 15 నుండి 18 వరకు ఉచిత స్పర్శదర్శనాన్ని నిలుపుదల చేస్తామని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. ఈ రోజులలో సర్వదర్శన క్యూలైన్లలో ఉన్న భక్తులకు కేవలం ఆలంకార దర్శనం మాత్రమే అనుమతించనున్నారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు. భక్తులందరూ ఈ తాత్కాలిక మార్పును గమనించాలని కోరారు.

ఇదే సమయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివచ్చి స్వామి, అమ్మవార్ల దర్శనం పొందుతున్నారు. ఇప్పటికే క్యూకాంప్లెక్స్‌లు పూర్తిగా నిండిపోయాయి, సర్వదర్శనానికి గంటల తరబడి భక్తులు వేచి చూస్తున్నారు.

రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. ఈ రద్దీలో భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీరు, అల్పాహారం వంటి సౌకర్యాలు దేవస్థానం అధికారులు అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories