Top
logo

శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద.. ఐదోసారి గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద.. ఐదోసారి గేట్లు ఎత్తివేత
X
Highlights

శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద.. ఐదోసారి గేట్లు ఎత్తివేత శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద.. ఐదోసారి గేట్లు ఎత్తివేత

రాయలసీమలో కురిసిన వర్షానికి శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 79 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 96 వేల‌ క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 215టీఎంసీలు, ప్రస్తుతం 215టీఎంసీలకు నీరు చేరుకుంది. దీంతో అధికారులు ఒక గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఇలా ఈ సంవత్సరంలో ఐదోసారి క్రస్ట్ గేట్లను ఎత్తినట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ ...

అలాగే కుడి, ఎడమగట్టు కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు సాగర్ జలాశయంలోకి వరదనీరు చేరడంతో అధికారులు నాగార్జునసాగర్‌ జలాశయం 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయంలోకి 60,649 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అంతే క్యూసెక్కుల నీటిని పులిచింతల వదిలారు. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాలకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాలకు 50000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే నీటిని దిగువకు వదిలారు.

Next Story