Top
logo

రికార్డు సృష్టించిన శ్రీశైలం జలాశయం.. 30 ఏళ్లలో ఇదే తొలిసారి..

రికార్డు సృష్టించిన శ్రీశైలం జలాశయం.. 30 ఏళ్లలో ఇదే తొలిసారి..
Highlights

శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గత మూడు నెలలుగా ఎడతెరిపి లేకుండా పశ్చిమ కనుమల్లో కురుస్తున్న ...

శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గత మూడు నెలలుగా ఎడతెరిపి లేకుండా పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు మరోసారి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దాంతో శ్రీశైలం జలాశయానికి 3 లక్షలకు పైగా ఇన్ ఫ్లో రావడంతో ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఏడోసారి ఎత్తేశారు. ఒకసంవత్సరంలో ఏడుసార్లు గేట్లను ఎత్తడం ఇదొక రికార్డుగా చెబుతున్నారు ఇరిగేషన్ అధికారులు.. గత 30 సంవత్సరాల్లో ఇలా ఎన్నడూ జరుగలేదు. ఇదే తొలిసారి. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. దాంతో ఎగువనుంచి వస్తున్న ఫ్లో కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయంలోకి వదలడంతో వరద నీరు మరింతగా పెరుగగా, జలాశయం ఏడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

885 అడుగుల నీటిమట్టం ఉండే జలాశయంలో ప్రస్తుతం 884.80 అడుగుల మేరకు నీరుంది. ఈ క్రమంలో మిగులు జలాలు ఇటు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా 6,458 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల విడుదల చేశారు. మంగళవారం సాయంత్రానికి 3.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో.. 7 గేట్లను ఎత్తి సాగర్ కు విడుదల చేయగా.. ఇటు సాగర్ కు కూడా ఇన్ ఫ్లో 2.24 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దీంతో 12 గేట్లను ఎత్తి 2 లక్షల 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టే పులిచింతల స్టోరేజి డ్యామ్ కు వదులుతున్నారు.

Next Story