Payakaraopeta: జనవరి 26, 27 తేదీల్లో శ్రీ ప్రకాష్ లో స్పందన కార్యక్రమం

Payakaraopeta: జనవరి 26, 27 తేదీల్లో శ్రీ ప్రకాష్ లో స్పందన కార్యక్రమం
x
Highlights

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయడానికి స్పందన ఒక వేదిక అవుతుందని శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి శ్రీ సి.హెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు.

పాయకరావుపేట: విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయడానికి స్పందన ఒక వేదిక అవుతుందని శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి శ్రీ సి.హెచ్ విజయ్ ప్రకాష్ తెలిపారు. ఈ నెల 26, 27 తేదీలలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ అనుబంధ సంస్థలైన స్పేసెస్ డిగ్రీ కాలేజీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విద్యార్థులు పాల్గొంటారన్నారు.

ఇందులో గ్రూప్ ఈవెంట్స్ నందు డాన్స్, బృందగానం, నాటికలు, మైమ్, క్విజ్, వకృత్వ పోటీలు ఉంటాయని తెలిపారు. అలాగే వ్యక్తిగత విభాగంలో క్లాసికల్ డాన్స్, స్పాట్ పెయింటింగ్, పోస్టర్ మేకింగ్, మెహందీ, షార్ట్ ఫిలిం, స్పాట్ ఫోటోగ్రఫీ, టాలెంట్ హంట్, ల్యాండ్ ఆర్ట్ మొదలగు అంశాలు ఉంటాయని కార్యక్రమ కన్వీనర్ & స్పేసెస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. కే వీర్రాజు తెలిపారు. ఈ కార్యక్రమ ముగింపు వేడుకలు 27 వ తేదీన ముఖ్య అతిథిగా అరకు ఎంపీ, పూర్వ విద్యార్థిని గొట్టేటి మాధవి హాజరవుతారని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వీర్రాజు తెలియజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories