Top
logo

శ్రీనివాస్‌ నా అంతు చూస్తానంటూ భయపెట్టాడు : వర్ల రామయ్య

శ్రీనివాస్‌ నా అంతు చూస్తానంటూ భయపెట్టాడు : వర్ల రామయ్య
X
Highlights

-ఏపీలో ముదురుతున్న పోలీస్ వర్సెస్ వర్ల రామయ్య వివాదం -శ్రీనివాస్‌ నా అంతు చూస్తానంటూ భయపెట్టాడు -పోలీస్‌ శ్రీనివాస్‌పై తాడేపల్లి పీఎస్‌లో వర్ల రామయ్య కంప్లైంట్‌

ఏపీలో పోలీస్ యూనియన్, టీడీపీ నేత వర్ల రామయ్య మధ్య వివాదం ముదురుతోంది. పోలీసుల జాతకాలన్నీ తనకు తెలుసని, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న వర్ల రామయ్య వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో తన పట్ల ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్ అవమానకరంగా మాట్లాడారని,అంతు చూస్తానంటూ భయపెట్టారని వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాస్ ఒక రాజకీయ ప్రత్యర్థిగా మాట్లాడుతున్నాడని, పోలీస్ అధికారుల సంఘం నాయకుడిగా అలా మాట్లాడే హక్కు అతనికి లేదన్నారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story