సిక్కోలు జెడ్పీ సమావేశం... ప్రజా సమస్యల ప్రస్తావన కరువు


సిక్కోలు జెడ్పీ సమావేశం... ప్రజా సమస్యల ప్రస్తావన కరువు
ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయాల్సిన ఆ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంకు మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా. హాజరైన ఎంపిపిలు, జడ్పీటీసీలేమో సమయపాలన పాటించడం లేదు.
ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయాల్సిన ఆ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంకు మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా. హాజరైన ఎంపిపిలు, జడ్పీటీసీలేమో సమయపాలన పాటించడం లేదు. పర్సనల్ ఎజెండాతో వాక్ అవుట్. కరెక్ట్‌గా గంటలో ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అన్నట్టుగా సమావేశం ముగిసింది. వేలాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి అధికారులు నిర్వహించిన ఈ సమావేశం తూతూ మంత్రంగా జరగడంపై జిల్లావాసులు మండి పడుతున్నారట. ఇంతకు ఏమా జిల్లా..? వాచ్ దిస్.
సిక్కోలు.. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం విమర్శల పాలైంది. ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చ అన్న ఊసే లేకపోవడం నవ్వుల పాలు చేస్తోంది. మీటింగ్‌లో సమస్యలను ప్రస్తావిస్తారని వేచి చూసిన అధికారులకు కంగు తినిపించారు ఎంపీపీలు, జడ్పిటిసిలు. వైసీపీ ఎమ్మెల్సీ విక్రాంత్‌ను పాలకొండ మండల సమావేశానికి రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ.. జిల్లా సర్వసభ్య సమావేశాన్ని వాకౌట్ చేయడం పట్ల జిల్లాలో ఎంపీపీ, జడ్పిటిసిలు ట్రోల్స్‌కు గురి అవుతున్నారు.
యూరియా కొరతతో జిల్లాలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగు, తాగునీరుతో పాటు సీజనల్ వ్యాధులపై సమావేశంలో చర్చిస్తారని
అధికారులు ఆశించారు. కానీ రైతుల సమస్యలన్ని గాలికి వదిలేసి.. వీళ్ళ పర్సనల్ అజెండానే ప్రామాణికంగా సమావేశాన్ని వాక్ అవుట్ చేయడం పట్ల రైతులు, జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పార్టీ యధా రాజా తథా ప్రజా అన్న చందాన తయారయ్యారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ అధినేత తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో చర్చకి వస్తానని, లేదంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పినట్టు.. అదే తరహాలో జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీపీలు, జడ్పిటిసిలు ప్రజా సమస్యల్ని గాలికి వదిలి ఓ ఎమ్మెల్సీని అడ్డుకున్నారంటూ వేలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సమావేశాన్ని రసాభాస చేయడం ఎంతవరకు సమంజసం అని రాజకీయ విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్సీని అడ్డగించిన ఘటనపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈవో, కలెక్టర్ హామీ ఇచ్చినా తగ్గేదేలే అంటూ వాకౌట్ చేసిన ప్రజాప్రతినిధులను జడ్పీ చైర్‌పర్సన్ విజయ వెనకేసుకు రావడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 10గంటల 30 నిమిషాలకు మీటింగ్ అయితే 11:30 వరకూ సీట్లన్నీ ఖాళీయే. 11.32 నిమిషాలకు చైర్ పర్సన్ ప్రిరియా విజయ తన సీట్ లో కూర్చున్నారు. సమావేశం 11.45 గంటల కు మొదలైంది. అంటే 1.15 నిమిషాలు ఆలస్యంగా స్టార్టైంది. ఈ ఘటన చూసిన జిల్లా వాసులంతా.. జిల్లా అభివృద్ధిపై నాయకులకు ఉన్న శ్రద్ధ ఏంటో..ఈ టైమ్ చూస్తే తెలుస్తుందంటూ చురకలంటిస్తున్నారట.
38 మంది జెడ్పీటీసీలకు 15 మంది హాజరు కాగా.. 38మంది ఎంపీపీలకు 16 మంది హాజరయ్యారు. ఎంపిటిసీలు జిల్లా వ్యాప్తంగా 678 మంది ఉండగా 35 మంది వచ్చారు. సభ ప్రారంభమైన వెంటనే ఎమ్మెల్సీ విక్రాంత్ లేచి పాలకొండలో తనకు జరిగిన అన్యాయంపై 20 నిమిషాల పాటు గోడును వెళ్లబుచ్చారు. దానికి మద్దతుగా పలువురు జడ్పిటిసిలు.. ఎమ్మెల్సీకి జరిగిన అన్యాయంపై చర్చ పెట్టాలని పట్టుబట్టారు. అగ్నికి ఆజ్ఞం పోసిన చందాన టెక్కలి జడ్పిటిసి దువ్వాడ వాణి.. ఆ ఎంపీడీవోని వెంటనే సస్పెండ్ చేయకపోతే సభను జరపనివ్వం అంటూ రెచ్చగొట్టడంతో కొందరు సభ్యులు ఆమెకు మద్దతుగా ఎమ్మెల్సీని అడ్డుకున్న పోలీసుల్ని, ఎంపీడీవోని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. సభ పక్కదోవ పట్టడాన్ని గమనించిన జడ్పీ సీఈఓ శ్రీధర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్.. బాధ్యులపై చర్యలకు హామీ ఇస్తున్నా సిరిపురం జగన్ మోహన్ రావు అనే జడ్పిటిసి పోడియం వైపు దూసుకెళ్తూ జడ్పీ సీఈఓని తనదైన శైలిలో బెదిరించారు. అలా కొంత గందరగోళం నెలకొనడంతో.. జడ్పీ చైర్పర్సన్ సభను నిలిపివేస్తూ వాక్ అవుట్ చేస్తున్నామని ప్రకటించడంతో ప్రజల సమస్యలు గాలికి వదిలి అందరూ బయటికి వెళ్లిపోయారు. ఇలా ఎంతో కీలకమైన జిల్లా పరిషత్ సమావేశం మొక్కుబడిగా సాగింది.
జిల్లా సమస్యల్ని ప్రస్తావించకుండా ఎంపీపీలు, జడ్పిటిసిలు సభను వాకౌట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఓ పథకం ప్రకారమే సభ నుండి వాకౌట్ చేయడానికి వైసీపీ వారు వచ్చారనే టాక్ నడుస్తుంది. ఓ మండల సమావేశాన్ని అడ్డుపెట్టుకొని ఇలా వాకౌట్ చేయడం సబబు కాదు అంటూ రాజకీయ విజ్ఞులు అంటున్నారు. మరోవైపు గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి వేదికైన జడ్పీ సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం, లోకల్ లో ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈ సమావేశానికి రాకపోవడం చూస్తుంటే వైసీపీ ఎంపీపీలు జడ్పీటీసీలు వాకౌట్ చేస్తారని సమాచారం లీక్ వల్లే మంత్రి రాలేదని జిల్లాలో టాక్ నడుస్తోందట. సమయపాలన పాటించని ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని గతం జడ్పీ సమావేశంలో బీరాలు పరికిన మంత్రి అచ్చన్న.. ఇప్పుడు అధికారులందరూ 9:30కే తమ తమ సీట్లలో కూర్చున్నారు. కానీ అచ్చన్న కోటబొమ్మాళిలో ఉండి కూడా రాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా అభివృద్ధికే పెద్దపీట అంటు లెక్చర్లు ఇచ్చిన మంత్రి ఈ సమావేశానికి ఎందుకు డొమ్మా కొట్టారు? మంత్రి అదేరోజు వేరొక ప్రోగ్రాం పెట్టుకోవడమేమిటి అని జిల్లా వాసులు, సమావేశానికి వచ్చిన నాయకులు మండిపడుతున్నారట. ప్రజా సమస్యల కన్నా ప్రారంభోత్సవాలే ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారట.
ఈ కార్యక్రమానికి mlc విక్రాంత్ కూడా 11.25 నిమిషాల తర్వాతే వచ్చారు. జిల్లా మంత్రికంటే కార్యక్రమాలు ఉంటాయి మరి మిగతా ఎమ్మెల్యేలకు ఏం కార్యక్రమాలు ఉన్నాయి. 15 రోజుల ముందే అధికారులు సమాచారం ఇస్తారు. జిల్లాలో ప్రజలకు అవసరమైన పనులు, తీర్మానాలే ఈ సమావేశంలో ముఖ్య అజెండా. ఆ విషయం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులకు తెలియదా అని జిల్లా వాసులు మండిపడుతున్నారు. ఉన్న పనుల్ని వాయిదా వేసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు లేదా..? వీరి గైర్హాజరుతో సమావేశం సాదాసీదాగా సాగిందట. ఏదో సమావేశం పెట్టాలి కాబట్టి ఏర్పాటు చేశామన్నట్లు ఉందే తప్ప ప్రజా సమస్యల ప్రస్తావనే కరువైందిట. ఈ సమావేశంలో ఆరు ప్రధాన శాఖలకు సంబంధించిన అంశాలను అజెండాలో చేర్చినా ప్రయోజనం లేదు. ఏదో మొక్కుబడిగా చర్చ నడిపి మమ అనిపించారు.
కీలకమైన జిల్లా సర్వ సభ్య సమావేశం ఇలా జరగడం పట్ల సభ్యులతో పాటు జిల్లా వాసులు మండిపడుతున్నారట. సమయపాలన పాటించని ఇటువంటి ప్రజా ప్రతినిధుల వల్ల తమకు ఒరిగేది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు..? సమావేశాన్ని వాకౌట్ చేయడం సరికాదు అనేది జిల్లా వాసుల మనోగతం. అధికార పార్టీ నాయకులు ఎవరూ లేకపోవడం వల్లనే ఇలా జరిగినట్లు జిల్లాలో పెద్ద టాక్. కనీసం రాబోయే సమావేశాలకైనా సమయపాలన పాటిస్తారని ఆశిద్దాం అని రాజకీయ విజ్ఞులు అంటున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



