శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
x
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Highlights

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన వద్ద కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. మందస మండలం కొత్తపల్లి...

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన వద్ద కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. మందస మండలం కొత్తపల్లి బ్రిడ్జి వద్ద వేగంగా కారు వస్తుంది. బ్రిడ్జి వద్ద అదుపు తప్పి పక్కనున్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పంట కాలువలో నుంచి నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. సింహాచలం నుంచి ఒరిస్సాలోని బంధువుల ఇంటికి కారులో వెళుతుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories