నియోజకవర్గ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

నియోజకవర్గ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
x
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Highlights

18వ డివిజన్ పరిధిలోని హరనాథపురంలో, 3వ వీధిలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు పనులకు ఆయన శుక్రవారం శంఖుస్థాపన చేశారు.

నెల్లూరు: నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.18వ డివిజన్ పరిధిలోని హరనాథపురంలో, 3వ వీధిలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు పనులకు ఆయన శుక్రవారం శంఖుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అందులో భాగంగా రూరల్ నియోజకవర్గంలో 50 కోట్లతో పనులు చేపడుతున్నామని అన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తికి మించి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. డివిజన్ ఇంఛార్జ్ లు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపిని ప్రజలు ఆశీర్వదించాలని కోటంరెడ్డి కోరారు. అనంతరం స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కోటంరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు సమస్య చెప్పిన 10 రోజులకే పనులు ప్రారంభించారని ధన్యవాదాలు తెలియజేశారు. అంతకు ముందు ఆ ప్రాంతానికి చేరుకున్న కోటంరెడ్డికి, స్థానిక మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అశోక్ నాయుడు, మాళెం సుధీర్ కుమార్ రెడ్డి, పెనాక రామకృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, మారంరెడ్డి కుమార్, కొల్లి పవన్ కుమార్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories