ప్రపంచ రికార్డు దిశగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు

ప్రపంచ రికార్డు దిశగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు
x
జి. ఇందిరా ప్రియదర్శిని, జి. ప్రమీలారాణి, పి ప్రశాంత్ కుమార్, సిహెచ్.లోవ లక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ రామ్మోహన్
Highlights

ప్రపంచ రికార్డు సాధించేందుకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు భారతదేశంలో 7 రాష్ట్రాల్లో తమ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు స్పోర్ట్స్ డ్రిల్, యోగాసనాలు వేసే కార్యక్రమాన్ని బుధవారం చేపట్టింది.

తుని: ప్రపంచ రికార్డు సాధించేందుకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు భారతదేశంలో 7 రాష్ట్రాల్లో తమ విద్యా సంస్థల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులు ఒకే సారి స్పోర్ట్స్ డ్రిల్, యోగాసనాలు వేసే కార్యక్రమాన్ని బుధవారం చేపట్టింది. 1 నుంచి 5 వ తరగతి వరకు చదువే ప్రాథమిక విద్యార్థులు 214 కేంద్రాల్లో 1,42,000 మంది విద్యార్థులు ఒకే సమయంలో నిర్విరామంగా 7 నిమిషాల పాటు స్పోర్ట్స్ డ్రిల్ ప్రదర్శించారు.

అదే విధంగా 3 నుంచి 5వ తరగతి చదివే ప్రాథమిక విద్యార్థులు 214 కేంద్రాల్లో ఒకే సమయంలో 76,000 మంది విద్యార్థులు నిర్విరామంగా 15 నిమిషాల పాటు 45 రకాల యోగాసనాలు ప్రదర్శించి ప్రపంచ రికార్డు సాధించే దిశగా అడుగులు వేశారు. ప్రపంచ రికార్డు సాధించేందుకు నిర్వహిస్తున్న ఈవెంట్స్ ఎలైట్ వరల్డ్ రికార్డ్స్ ఎల్ ఎల్ సి, ఏషియన్ రికార్డ్స్ అకాడమీ, ఎన్టీఆర్ రికార్డ్స్ అకాడమీ పర్యవేక్షణలో జరిగాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో విద్యార్థులు స్పోర్ట్స్ డ్రిల్, యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, శ్రీ చైతన్య ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్పోర్ట్స్ డ్రిల్, యోగాసనాల వల్ల విద్యార్థుల్లో మానసిక వికాసం ఏర్పడుతుందన్నారు. సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్ స్రవంతి, కుసుమ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా డీ.పోలవరం జిల్లా పరిషత్ హై హై స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు జి. ఇందిరా ప్రియదర్శిని, జి. ప్రమీలారాణి, పి ప్రశాంత్ కుమార్, సిహెచ్.లోవ లక్ష్మి , వైస్ ప్రిన్సిపల్ రామ్మోహన్, ఏవో బాలాజీ, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories