తిరుమలలో గురువారం నుంచి శ్రీవారి ఏకాంత బ్రహ్మోత్సవాలు.. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం

తిరుమలలో గురువారం నుంచి శ్రీవారి ఏకాంత బ్రహ్మోత్సవాలు.. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం
x
Tirumala (File Photo)
Highlights

గురువారం నుంచి తిరుమలల్లో శ్రీవారి బ్రహోత్సవాలు జరగనున్నాయి.

గురువారం నుంచి తిరుమలల్లో శ్రీవారి బ్రహోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 11 వరకు తిరుమల శ్రీవారి ఏకాంత బ్రహ్మోత్సవాల ఎలాంటి లోపాల్లేకుండా నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. స్వామివారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి భక్తులు ఇంటి నుంచే ఎస్వీబీసీ ఛానల్ ద్వారా కల్యాణాన్ని వీక్షించవచ్చని తెలిపారు.

ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతోందని రక్షించడానికి శ్రీ రామచంద్రుడు వస్తున్నట్లుం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకు శ్రీ రామ నవమి సందర్బంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల శ్రీవారి గర్భాలయంలో సీతారామలక్ష్మణ విగ్రహాలున్నాయి.. ఈ ఏడాది ఆ విగ్రహాలకు అభిషేకం జరిపి ఆస్థానం నిర్వహించనున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. ఒంటిమిట్టలో ఈ నెల 7న సీతారాముల కల్యాణం జరుగుతుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

అఖండ దీపం పై వస్తున్న వార్తలు అవాస్తవం!

తిరుమలలో శ్రీవారి గర్భగుడి లోకి వెళ్లి వీడియో తీశారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వై వి సుబ్బా రెడ్డి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో గర్భగుడిలో తీసింది కాదని, అలిపిరి గేటు వద్ద మూల విరాట్ నమూనా ఆలయంలో తీసిందని వివరించారు. అఖండ దీపాన్ని కొండెక్కించినట్లు, స్వామి వారికి కైంకర్యాలు, సేవలు చేయడం లేదంటూ కొందరు దుష్ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. స్వామి వారికి నిత్య కైంకర్యాలు యధావిధిగా కొనసాగుతున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories