సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి

సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్ర సమాచారం శాఖా ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్ర సమాచారం శాఖా ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిజం వృత్తిలో నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనాథ్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. మొదట ఆంధ్రప్రభ ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

కడప జిల్లా ఆంధ్రప్రభ డెస్క్ లో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషంగా ఆకట్టుకుంది. 1990వ దశకంలో ఆయన దాదాపు ఐదేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా.. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. కాగా ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories