జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. రోడ్లపై ఉమ్మితే ఇక అంతే !


రోడ్లపై ఉమ్మే అలవాటు చాలామందికి ఉంది. పాన్, గుట్కా, సిగరేట్ వంటి మాదకద్రవ్యలు తీసుకుని ఉమ్మివేయడం చాలా మంది అలవాటు.
రోడ్లపై ఉమ్మే అలవాటు చాలామందికి ఉంది. పాన్, గుట్కా, సిగరేట్ వంటి మాదకద్రవ్యలు తీసుకుని ఉమ్మివేయడం చాలా మంది అలవాటు.తాజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుంది. ఎవరైనా ఉమ్మితే విధాన పరమైన చర్యలకు సిద్ధమవుతోంది. రోడ్డుపై ఎక్కడ ఉమ్మినా కేసులు పెట్టేందుకు సిద్దమైంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల్ని పాటిస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. దాని ప్రకారం రోడ్లపై ఉమ్మి వేస్తే కేసు నమోదవుతుంది. పొగాకు ఉత్పత్తులు, పాన్, గుట్కాలు ఇలాంటివి తీసుకున్నవారికి నోట్లో లాలాజల గ్రంథులు ఊరి లాలాజలం ఉత్పత్తి అవుతుంది. మింగినా ప్రమాదం కాబట్టి చాలా మంది దాన్ని ఉమ్మివేస్తారు. కానీ ఇలా జనసందోహం ఉన్న ప్రదేశంలో ఉమ్మితే కరోనా వైరస్ ప్రబలే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇకపై పొగాకు ఉత్పత్తులు, నమిలే పొగాకు వంటివి వాడరాదని స్పష్టం చేసింది.
పొగాకు ఉత్పత్తుల వాడకం, తద్వారా ఉమ్మి వేసే విధానాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జనం తిరిగే ప్రదేశంలో ఉమ్మితే కరోనా వైరస్ వ్యాపిస్తుందని పరిశోధనల్లో తేలింది కాబట్టి రోడ్లపైనా ఎక్కడబడితే అక్కడ ఉమ్మివేయడాన్ని నిషేధిస్తు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఇకపై ఉమ్మి వేస్తే వారిపై 1860 ఐపీసీలోని క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం చర్యలుంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



