ఏలూరు వింత వ్యాధి కారణాలపై ఊహాగానాలు!

ఏలూరు వింత వ్యాధి కారణాలపై ఊహాగానాలు!
x
Highlights

ఏలూరులో వింత వ్యాధికి కారణాలేంటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాధితుల లక్షణాలు గతంలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజ్ ఘటన లక్షణాలను పోలి ఉన్నాయి.

ఏలూరులో వింత వ్యాధికి కారణాలేంటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాధితుల లక్షణాలు గతంలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజ్ ఘటన లక్షణాలను పోలి ఉన్నాయి. బాధితులకు అప్పటికప్పుడు ప్రాణహాని లేకపోయినా.. వాంతులు, విరోచనాలు, అపస్మారక స్థితికి చేరుకోవడం, నురగలు కక్కడం, ఫిట్స్ తో పడిపోవడం లాంటి లక్షణాలు అప్పట్లో విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో కూడా కనిపించాయి. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీతో అప్పట్లో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇప్పుడు రెండు రోజుల నుంచి అంతుచిక్కని రీతిలో జనం అనారోగ్యం పాలవుతుంటే..వ్యాధి కారణాన్ని కనుగొనే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.నీరు, పాలు, కూరగాయలు, శానిటేషన్, ఇలా రకరకాల కోణాల్లో పరిశీలించినా ఎలాంటి క్లూ దొరకలేదు.. ఏదైనా పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు లీకై ఉంటుందా అనే అనుమానంతో అధికార్లు ఆ దిశగా శోధిస్తున్నారు. ఏలూరుకు సమీపంలో ఉన్న ఓ పాలిమర్స్ కంపెనీపై అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories