ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ మీదుగా ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ మీదుగా ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
x
Highlights

ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ మీదుగా ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

కొంతకాలంగా విజయవాడ మీదుగా ప్రయాణించే ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిపోయింది. దాంతో రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ ప్రకటించింది. ఈ మేరకు పీఆర్వో నుశ్రత్‌.ఎం.మండ్రూప్‌కర్‌ బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. రైలు నెంబరు (07053) సికింద్రాబాద్‌ – కాకినాడటౌన్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 9.40కు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 7.40కు కాకినాడకు చేరుకుంటుంది. అలాగే రైలునెంబరు (07054) కాకినాడటౌన్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 13వ తేదీ రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 7.40కు సికింద్రాబాద్‌ కు చేరుకుంటుంది. రైలునెంబరు (07255) నరసాపూర్‌– సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 10,12వ తేదీలలో రాత్రి 6 గంటలకు నరసాపూర్‌ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

రైలునెంబరు (07256) సికింద్రాబాద్‌–నరసాపూర్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 6.05కు నరసాపూర్‌ కు చేరుకుంటుంది. రైలునెంబరు (07255) నరసాపూర్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 13వ తేదీ రాత్రి 8.50కు నరసాపూర్‌ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 5.50కు సికింద్రాబాద్‌ కు చేరుకుంటుందని విజయవాడ రైల్వే డివిజన్‌ వెల్లడించింది. ఈ రైళ్లు విజయవాడ మీదుగా రాక, పోకలు సాగిస్తాయని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories