ఆ జిల్లా సమస్య శాశ్వతంగా తీరుతుందా?

ఆ జిల్లా సమస్య శాశ్వతంగా తీరుతుందా?
x
Highlights

రాష్ట్రంలోనే తీవ్ర‌మైన క‌రువుకాట‌కాల‌తో అల్లాడుతున్న జిల్లా ఏదైనా ఉంది అంటే అది ప్రకాశం జిల్లాయే, తీవ్రమైన నీటి కష్టాలతో అల్లాడుతున్న ఈ జిల్లా వాసులకు...

రాష్ట్రంలోనే తీవ్ర‌మైన క‌రువుకాట‌కాల‌తో అల్లాడుతున్న జిల్లా ఏదైనా ఉంది అంటే అది ప్రకాశం జిల్లాయే, తీవ్రమైన నీటి కష్టాలతో అల్లాడుతున్న ఈ జిల్లా వాసులకు శాశ్వతంగా తాగు, సాగు నీరు అందించేందుకు గాను ప్రభుత్వం చేపట్టిన వెలుగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ వలన ప్రకాశం జిల్లాయే కాక నెల్లూరు, కడప జిల్లాలోని సుమారు 4.38 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది, అంతేకాక 15 లక్షలమందికి తాగునీరు కూడా అందుతుంది . ఈ ప్రాజెక్ట్‌కు ఈసారైనా రాష్ట్ర బడ్జెట్ లో ప్రాజెక్ట్ కు తగినన్ని నిధులు కేటాయిస్తారని జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తికావడం కోసం పెద్దఎత్తున రాజకీయ నేతలు ఉద్యమాలు చేస్తున్నారు.

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మూడేళ్ళ కిందటే పూర్తికావలసి ఉన్నా ఇప్పటికి పూర్తికాలేదు.. దీనికి కారణం ప్రతిఏటా బడ్జెట్లో తక్కువ కేటాయింపులు చేయడమేనని ప్రతిపక్షాలు అంటున్నాయి. 1996లో 980 కోట్ల అంచనా వ్యయంగా ఉన్న ప్రాజెక్టు విలువ 2018 నాటికి ఆర్ఆర్ ప్యాకేజీతో కలిపి 8వేలకోట్లకు కోట్లకు చేరింది. 2014 నాటికి 5 ప్రధాన కాలువల నిర్మాణం 60% పూర్తి అయ్యాయి. 3 ఖాళీలు పూర్తి చేశారు. కాని నీటిని నది నుంచి అడవిని దాటి మైదానానికి తీసుకు రావలసిన సొరంగాల పనులు మాత్రం పూర్తి కాలేదు. 2018 చివరి నాటికి కొద్ది సంవత్సరాలుగా బిల్లుల చెల్లింపులలో సమస్యల కారణంగా ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగాయి.. దాంతో సొరంగాల తవ్వకం పూర్తికాలేదు.

ప్రతి ఏటా బడ్జెట్లో ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇవ్వడం వలన పనులు ఆగిపోయి.. వ్యయం పెరిగిపోతోంది. ఇప్పటికే చాలాసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్ట్ ను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మొదటి దశ టన్నెల్ నిర్మాణం పూర్తి చేసి సంక్రాంతికి నీరు ఇస్తామని చెప్పారు. కానీ పనులు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టుల విషయంలో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి.. వెలుగొండను కూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు. దాంతో ఈ బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయిస్తారని ఎదురుచూస్తున్నారు. మరి ఏమౌతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories