ఇక్కడ గెలిస్తే మంత్రివర్గంలో పక్కా చోటు

ఇక్కడ గెలిస్తే మంత్రివర్గంలో పక్కా చోటు
x
Highlights

విశాఖజిల్లాలో ఆ నియోజకవర్గం నుండి పోటి చేసి గెలిస్తే చాలు మంత్రి స్థానం ఖాయం ఆ ప్రాంతం విజయమార్గం కు సోపానం రాజకీయ సమీకరణాలు కావచ్చు, లేక పొలిటికల్...

విశాఖజిల్లాలో ఆ నియోజకవర్గం నుండి పోటి చేసి గెలిస్తే చాలు మంత్రి స్థానం ఖాయం ఆ ప్రాంతం విజయమార్గం కు సోపానం రాజకీయ సమీకరణాలు కావచ్చు, లేక పొలిటికల్ సెంటిమెంట్ అయ్యిండుచ్చో అమాత్యుని పదివి మాత్రం వరిస్తుంది. అందుకే హేమాహేమాల పోటీ కి ప్రతిసారి వేదిక అవుతుంది. ఇంతకి విశాఖ లో ఈ నియోజకవర్గం స్పెషల్ ఏంటి.

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం. దేశంలోనే రెండవ మున్సిపాలిటీ. జనాభా పరంగా చిన్నదైనా రాజకీయ ప్రస్థానంలో మాత్రం చాలా ప్రత్యేకం. కాపు, రెడ్డి, యాదవ, మత్స్యకార సామాజిక వర్గాల ప్రాంతం. 1989 నుంచి 2019 ఎన్నికల వరకు ప్రస్థానం చూస్తే, ఐదుసార్లు టీడిపి, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి పీఆర్పీ విజయం సాధించాయి. అయితే మొదటి నుంచి విశాఖ అర్బన్‌కు మంత్రి పదవి దక్కకపోయినా, భీమిలికి మాత్రం మంత్రి పదవులు వరిస్తూ వచ్చాయి.

1972లో పి.వి.జి. రాజు వైద్యాఆరోగ్య శాఖ‌ చేసారు. 1983-85 లో పూసపాటి ఆనందగజపతిరాజు విద్యాశాఖమంత్రి. తరువాత 1985 నుంచి 2004 వరకు వరుసగా నాలుగుసార్లు టీడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అప్పల నరసింహరాజు రెండు పర్యాయాలు అబ్కారీ శాఖను నిర్వహించారు. అయితే 2004లో కర్రి సీతారం కాంగ్రెస్ నుంచి, 2009లో ముత్యంశెట్టి శ్రీనివాస్ పీఆర్పి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినా మంత్రిపదవులు దొరకలేదు. మరోసారి 2014లో టీడిపి నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావుకూ అమాత్యుని పదవి దక్కింది. అయితే ప్రస్తుతం 2019లో కూడా వైసిపి నుంచి గెలిచిన ముత్యంశెట్టి శ్రీనివాస్‌ను మంత్రి పదవి వరించింది. భీమిలిలో పోటీచేసి గెలిచిన ఎక్కువమంది నాయకులు మంత్రులయ్యారు.

అయితే 1985 నుంచి 2019 వరకు భీమిలిలో సుదీర్ఘకాలం టీడిపి హవా కొనసాగడంతో అక్కడ టీడిపికి ఎదురులేదన్న రాజకీయ నానుడి పెరిగింది. 2019 ఎన్నికల్లో కూడా లాస్ట్ మినిట్ వరకు టీడిపి నుంచి గంటా శ్రీనివాసరావు, ముత్యంశెట్టి ప్రత్యర్థులుగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. చివరకు గంటా ఉత్తరంకు వెళ్లగా, అవంతి మాత్రం పార్టీ మారి వైసిపికి వెళ్లారు. మంత్రి పదవి సెంటిమెంట్‌తోనే అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి పోటీ చేసి తన కలను సాకారం చేసుకున్నారు. ఏది ఏమైనా, పార్టీ ఏదైనా మరోసారి భీమిలికి మంత్రి స్థానం దక్కడం కాకతాళీయమే అయినా, పొలిటికల్ సెంటిమెంట్‌ మాత్రం కొనసాగుతోందన్నది ఇక్కడి నేతలు, జనాల మాట.

Show Full Article
Print Article
Next Story
More Stories