Sugamya Shankar: భరతనాట్యంతో పాటు అందాల పోటీల్లో రాణిస్తున్న పెనుకొండ యువతి

Sugamya Shankar: భరతనాట్యంతో పాటు అందాల పోటీల్లో రాణిస్తున్న పెనుకొండ యువతి
x
భరతనాట్యంతో పాటు అందాల పోటీల్లో రాణిస్తున్న పెనుకొండ యువతి
Highlights

ఆమె భరత నాట్య కళాకారిణి. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అందాల పోటీల్లోనూ రాణిస్తున్నారు. మిస్ సౌత్ ఇండియా పోటీల్లో రెండు...

ఆమె భరత నాట్య కళాకారిణి. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అందాల పోటీల్లోనూ రాణిస్తున్నారు. మిస్ సౌత్ ఇండియా పోటీల్లో రెండు అవార్డులు లభించాయి. అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన సుగమ్య శంకర్ పై స్పెషల్ స్టోరీ.

అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన యోగా గురువు రవిశంకర్ కూతురు సుగమ్య శంకర్. చిన్నప్పటి నుంచి చదువు, నాట్యంలో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నారు. మహారాష్ట్రలోని పండరీపురంలోని ప్రముఖ విద్యాలయంలో సుగమ్య డాన్స్ టీచర్ గా పనిచేస్తున్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ ద్వారా మద్రాసు యూనివర్శిటీ లో భరత నాట్యంలో ఎం ఏ చదువుతున్నారు. దేశ విదేశాల్లో సుగమ్య భరత నాట్యం ప్రదర్శనలు ఇస్తున్నారు. శ్రీ కళా, కళారత్న తదితర బిరుదులు వరించాయి. కేంద్ర రాష్ట్ర్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించాయి.

అందాల పోటీల్లోనూ సుగమ్య రాణిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2014 లో డాబర్ వాటిక నిర్వహించిన అండర్ 14 అందాల పోటీల్లో పాల్గొని సుగమ్య రెండో విన్నర్ గా నిలిచారు. ఇటీవల కేరళలో జరిగిన మిస్ సౌత్ ఇండియా పోటీల్లో రెండు అవార్డులు గెలుచుకున్నారు. ఏపీ క్వీన్ కిరీటంతో పాటు వీవర్స్ ఛాయిస్ లోనూ విజేతగా నిలిచారు.

అందాలపోటీల్లో గెలుపొందిన అనంతరం సుగమ్యకు సినిమా ఆఫర్లు వస్తుంటే అంగీకరించడంలేదు. భవిష్యత్తులో సినిమాల్లో నటిస్తానని చెబుతున్నారు. కళాక్షేత్రం నెలకొల్పి అందరికీ నాట్య విద్య అందించాలన్నది తన ఆశయమని సుగమ్య చెబుతున్నారు. అందం, ప్రతిభ ఒకే చోట ఉండదు అంటారు. కానీ సుగమ్యలో ఆ రెండు ఉన్నాయి. తాను అనుకున్న లక్ష్యం సాధించి భవిష్యత్ లో మరింత కీర్తీప్రతిష్టలు సంపాదించుకోవాలని హెచ్ ఎం టీవీ ఆల్ ద బెస్ట్ చెబుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories