కర్నూలు జిల్లాలో ప్రత్యేకతను సంతరించుకున్న రైతు జాతర.. ఏం చేస్తారంటే..?

Special Farmers Jatara in Kurnool District Story | Live News Today
x

కర్నూలుజిల్లాలో ప్రత్యేకతను సంతరించుకున్న రైతు జాతర.. ఏం చేస్తారంటే..?

Highlights

Kurnool - Rythu Jatara: గతంలో నెలరోజులపాటు జరిగే జాతర.. ఇపుడు 15 రోజులు...

Kurnool - Rythu Jatara: కర్నూలులో రైతు జాతర ఘనంగా సాగుతోంది... అయితే ఒకప్పుడు నెలరోజుల పాటు కర్ర సామానుతో హడావిడిగా ఉండే జాతర మారుతున్న కాలానికి అనుగుణంగా పక్షం రోజులకు పరితమైంది... అటవీ అధికారుల ఆంక్షలు, వ్యవసాయంలో పెరిగిన ఆదునికతో ఇనుప వ్యవసాయ పనిముట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది... రాయలసీమ నుండే కాకుండా అటు తెలంగాణతో పాటు ఇటు కర్ణాటక నుండి కదిలి వచ్చే అన్నదాతలతో కొత్త శోభను సంతరిచుకున్న రైతు జాతరపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం......

అమ్మవారిని ఆరాధిస్తూ.. రాయలసీమలో జరిగే జాతరలో కర్నూలు రైతు జాతరకు ప్రత్యేకత ఉంది. ఆరుగాలం కష్టించి శ్రమించే రైతన్నకు వాటికి ఉపయోగపడే పనిముట్లు ఈ జాతరలో కొలువు దీరుతాయి. జూపాడు బంగ్లా మండల పరిధిలో ఉన్న తర్తూరు గ్రామంలో ఈ సాంప్రదాయం నాలుగు శతాబ్ధాల క్రితం ప్రారంభమైందని సమాచారం. తర్తూరు గ్రామానికి నల్లమల అడవుల సమీపంలో ఉండడంతో సంవత్సరానికి ఒకసారి నిర్వహించే రంగనాథ స్వామి జాతరలో, రైతన్న వ్యవసాయానికి కావలసిన ప్రతి పనిముట్లు ఇక్కడ దొరుకుతాయి.

మంచి నాణ్యతతో ఉన్న కర్రతో అన్నదాతల పనిముట్లు చేయడం, ఇంటి పైకప్పులకు దంతెలు, దూళాలు, వాసాలు, స్థంబాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి సామాన్లను తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. తర్తూరు గ్రామంలోని ఉలవపాడు వంశానికి చెందిన రాజారెడ్డి అనే వ్యక్తి నిజాం సర్కార్ ఆధీనంలో వున్న వనపర్తి సంస్థానంలోని పెబ్బేరు సమీపంలోని శ్రీరంగాపురంలో రంగమ్మ అనే మహిళను వివాహం చేసుకుంటాడు... ఈ గ్రామంలో అతిపురాతనమైన రంగనాథ స్వామి ఆలయం ఉంది.... వివాహ అనంతరం హిందూ సాంప్రదాయ ప్రకారం పుట్టింటి వారితో ఒడి బియ్యం పోయించుకొని తర్తూరు గ్రామానికి బయలుదేరుతుంది...

అయితే ఎలాంటి రవాణా సౌకర్యాలుండేవి కావు... కేవలం ఎద్దుల బండితోనే ప్రయాణాలు సాగించాల్సి వచ్చేవి... తర్తూరు గ్రామానికి చేరుకున్న రంగమ్మ ఇంటిలోకి వెళ్లే మందు గడపకు పూజ చేసే సమయంలో తన ఒడిలో ఉన్న బియ్యం బరువు కావడంతో అందులో ఉన్న చెక్కబొమ్మను తీసి పక్కకు విసిరేసింది... ఆ బొమ్మ కాస్త పక్కనే ఉన్న ఎద్దుల గాడిపాకలో పడిపోయింద. కొన్ని రోజుల తరువాత శ్రీరంగాపురం రంగనాథ స్వామి రంగమ్మ భర్త కలలోకి వచ్చి తాను చెక్కరూపంలో గాడిపాకలో ఉన్నానని ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ అష్టమి నుండి చైత్రశుద్ధ బహుళ విధియ వరకు జాతర నిర్వహిస్తారు. ఇక్కడి జాతర కులమతాలకు అతీతంగా.. మత సామరస్యానికి ప్రతీకగా జరుగుతుంది.

స్వామి పశువుల గాడిపాకలో వెలవటంతో స్వామి ప్రతిరూపం చెక్కతో ఉండడంతో అక్కడ మనిషికి, పశువులతో ఉన్న సంబంధంతో పాటు పనిముట్ల విశిష్టత, ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పటి నుండి జాతర జరిపించే రోజుల్లో రైతులే హాజరు అయ్యేవారు. వ్యవసాయ పనుల్లో కీలకపాత్ర పోషించే గొర్రు, నాగలి, కాడిమాను, పార, బండిగెల్లలు, ఎద్దులు, రైతన్నకు అవసరమైన పనిముట్లు ఒకేచొట దొరకడంతో భారీగా వచ్చేవారు. అమ్మకానికి వచ్చిన వ్యాపారస్తులు అందరూ తమతో తెచ్చకున్న బియ్యం, సరుకులు అయిపోయేంత వరకు అనగా దాదాపు నెలరోజులకు పైగానే వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా జాతర 15 రోజులకే పరిమితమైపోయింది.

రైతులకు కావాల్సిన పనిముట్లు ఒకప్పుడు కర్రతో తయారు చేసేవి దొరుకుతుందేమి... కానీ నేడు ఇనుప పనిముట్ల కు కేరాఫ్ అడ్రస్ గా మారాయి.. తాతల, తండ్రుల నుండి వస్తున్న వారసత్వాన్ని వ్యాపారం లేకపోయిన వదిలిపెట్టలేకపోతున్నామంటున్నారు వ్యాపారస్తులు... ఒకప్పుడు సీమకే తలమానికంగా ఉన్న ఈ జాతర ఇపుడు కొత్త కలను సంతరించుకుంది.. ఆ నాటి సాంప్రదాయాలను నిలబెట్టేలా రైతన్నలకు చిన్న చిన్న కర్రల సామానైన దొరికితే...పూర్తి స్థాయిలో ఇనుముతో తయారు చేసిన సామాను దొరుకుతోంది.

రైతుల వ్యవసాయానికి ఆదినుండి కష్టాల్లో తోడుగా ఉండే మూగజీవాల అలంకరణ కోసం ప్రత్యేక సామాను ఇక్కడ అందుబాటులో ఉంటుంది... ఎద్దుల మెడలో కట్టే గంటల నుండి అలంకరించే జడ గంటల వరకు అప్పటి సంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ లభించడం ఆనవాయితీ... మరోవైపు వివిధ జాతులకు సంబంధించి ఎద్దులు ఎక్కడ లభిస్తాయి. 40 వేల రూపాయల ప్రారంభ ధర నుండి, పది లక్షల రూపాయల పూర్తి స్థాయి వరకు ఎద్దులు ఇక్కడ అమ్మకానికి పెట్టడం విశేషం....కర్నూలుజిల్లాలో తర్తూరు రైతు జాతర ఆద్యంతం జనరంజకంగా సాగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories