ఏడుగురు ఎమ్మెల్యేలతో ప్రత్యేక సభా సంఘం

ఏడుగురు ఎమ్మెల్యేలతో ప్రత్యేక సభా సంఘం
x
Highlights

అప్కాబ్, డి.సి.సి.బి.లు, పి.ఎ.సి.ఎస్ లలో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ కు ఎన్.అమరనాధ్ రెడ్డి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ప్రత్యేక సభా సంఘాన్ని శాసనసభాపతి ఏర్పాటు చేశారు.

అమరావతి: అప్కాబ్, డి.సి.సి.బి.లు, పి.ఎ.సి.ఎస్ లలో అవినీతి, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ కు ఎన్.అమరనాధ్ రెడ్డి నేతృత్వంలో కూన రవికుమార్, ధూలిపాళ్ళ నరేంద్రకుమార్, బొలిశెట్టి శ్రీనివాస్, యార్లగడ్డ వెంకట్రావు, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్ ఏడుగురు సభ్యులతో ప్రత్యేక సభా సంఘాన్ని శాసనసభాపతి ఏర్పాటు చేశారు. ఈ సభా సంఘానికి వినతులు / ఫిర్యాదులు సమర్పించదలచినవారు లిఖిత పూర్వకంగా సహాయ కార్యదర్శి, శాసనవ్యవస్థ సచివాలయం, రూం. నంబరు 227-సి, మొదటి అంతస్తు, శాసనసభ భవన సముదాయం, వెలగపూడి, అమరావతి-522238, గుంటూరు జిల్లా అనే చిరునామాకు గాని, [email protected] మెయిల్ కు గాని పంపవచ్చునని రాష్ట్ర శాసనవ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్ నెంబర్ 91-863-2449177లో కూడా తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

19న పిటిషన్ల కమిటీ సమావేశం

ఈనెల 19వ తేది శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో ఫిర్యాదుల కమిటీ సమావేశం జరగనుందని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర ఒక ప్రకటనలో తెలియజేశారు. తాగునీటి వనరులు పరిరక్షణ(Protection of Water Bodies)అంశంపై ఎంఎల్ఏ డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు,ఇతర ఫిర్యాదులపై ఈ కమిటీ సమావేశం జరగనుందని సెక్రటరీ జనరల్ తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories