నిన్నటి ఘటనపై క్రిమినల్ కేసు పెట్టండి: మార్షల్స్ కు స్పీకర్ ఆదేశం

నిన్నటి ఘటనపై క్రిమినల్ కేసు పెట్టండి: మార్షల్స్ కు స్పీకర్ ఆదేశం
x
తమ్మినేని
Highlights

ఏపీ అసెంబ్లీ ఆవరణలో నిన్న జరిగిన ఘటనలపై క్రిమినల్‌ కేసును పెట్టాలని మార్షల్స్‌ను స్పీకర్‌ తమ్మినేని ఆదేశించారు. నిన్న చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలతో పాటు...

ఏపీ అసెంబ్లీ ఆవరణలో నిన్న జరిగిన ఘటనలపై క్రిమినల్‌ కేసును పెట్టాలని మార్షల్స్‌ను స్పీకర్‌ తమ్మినేని ఆదేశించారు. నిన్న చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలతో పాటు బయటివారు కూడా ఉన్నారన్న విషయం వీడియోల్లో స్పష్టమైందన్న తమ్మినేని, వారిని గుర్తించేందుకు పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు. నిన్నటి ఘటనలు అత్యంత దురదృష్టకరమైనవని, అసెంబ్లీ రక్షణ నిమిత్తం నియమించబడిన మార్షల్స్ తో దురుసుగా ప్రవర్తించడం సరికాదని స్పష్టం చేశారు. క్రిమినల్ కేసు పెట్టాలని తాను సభ నుంచి మార్షల్స్ కు ఆదేశాలు జారీ చేస్తున్నానని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories