వివాహబంధంతో ఒక్కటైన స్పానిష్‌ అమ్మాయి.. అనంతపురం అబ్బాయి

వివాహబంధంతో ఒక్కటైన స్పానిష్‌ అమ్మాయి.. అనంతపురం అబ్బాయి
x
Highlights

ప్రేమకు కుల, మత ప్రాంతాలు లేవని మరోసారి రుజువైంది. స్పానిష్ అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన...

ప్రేమకు కుల, మత ప్రాంతాలు లేవని మరోసారి రుజువైంది. స్పానిష్ అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విజయకుమార్‌ వృత్తిరీత్యా వైద్యుడు. బత్తలపల్లిలోని ఆర్టీటీ ఆస్పుత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. స్పెయిన్‌ దేశానికి చెందిన కార్లా అనే యువతి వృత్తి రీత్యా దంత వైద్య నిపుణురాలు. ఈమె కూడా ఇక్కడే ఆర్డీటీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం వీరిద్దరికి పరిచయం ఏర్పడింది.

కొంతకాలానికి వీరి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకున్నారు. వీరి పెద్దలతో సంప్రదింపులు జరిపారు. వారు వివాహానికి ఒకే చెప్పారు. శనివారం తాడిపత్రి పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికుమార్తె తలిదండ్రులు కన్యాదానం చేశారు. స్పానిష్ నుంచి వచ్చినా వారంతా హిందూ సంప్రదాయంలో కనిపించారు. ఇక కుటుంబ సభ్యులు, బంధువులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ జంటను చూసేందుకు స్థానికులు పోటీ పడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories