Trains Cancelled: మరో నెల రోజుల పాటు ఆ రూట్లో కొన్ని రైళ్లు రద్దు, ఇంకొన్ని రైళ్లు దారి మళ్లింపు

South Central Railway cancelled and diverted some trains due to development works at Dharmavaram Railway station
x

ధర్మవరం రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

Highlights

South Central Railway cancelled trains: ధర్మవరం రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

Trains Cancelled by South Central Railway: సౌత్ సెంట్రల్ రైల్వై జోన్ పరిధిలోని గుంతకల్లు డివిజన్ ధర్మవరం రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. అలాగే, హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు రైళ్ల దారి మళ్లింపుపై సౌత్ సెంట్రల్ రైల్వే అప్‌డేట్ అందించింది.

ప్రస్తుతం ధర్మవరం రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో మే 16 నుండి 18 మధ్య అక్కడి నుండి నుండి రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. ఇంకొన్ని రైళ్లను మరో మార్గంలోకి డైవర్ట్ చేస్తున్నారు.

ధర్మవరం రైల్వే స్టేషన్ గుండా రాకపోకలు సాగించే ప్యాసింజర్ రైళ్లను మే 19 వరకు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. అందులో కొన్ని ప్యాసింజర్ రైళ్లను మే 16 నుండి 18 మధ్య పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లే రైళ్లను గుత్తి నుండి కడప మీదుగా రేణిగుంటకు దారి మళ్లిస్తున్నారు.

రద్దయిన రైళ్ల జాబితా ఇలా ఉంది

తిరుపతి - గుంతకల్ ప్యాసింజర్ రైలు (57408) ఏప్రిల్ 16 నుండి మే నెల 18వ తేదీ వరకు

గుంతకల్ - తిరుపతి ప్యాసింజర్ రైలు (57404) ఏప్రిల్ 15 నుండి మే నెల 19వ తేదీ వరకు

తిరుపతి - కదిరిదేవరపల్లి ప్యాసింజర్ ట్రైన్ (57405) ఏప్రిల్ 15 నుండి మే నెల 16 వరకు

కదిరిదేవరపల్లి - తిరుపతి ప్యాసింజర్ ట్రైన్ (57406) ఏప్రిల్ 15 నుండి మే నెల 17వ తేదీ వరకు

అమరావతి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (12766) మే నెల 5, 8, 12, 15 తేదీలలో రద్దు

తిరుపతి - అమరావతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (12765) మే నెల 6, 10, 13, 17 తేదీలలో రద్దు

ధర్మవరం- బెంగళూరు ప్యాసింజర్‌ రైలు(06595/96) మే 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రద్దు

గుంతకల్లు నుంచి హిందూపురం వెళ్లే (77213) రైలు మే 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రద్దు

హిందూపురం నుంచి గుంతకల్లు వెళ్లే (77214) రైలు మే 5వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రద్దు

యశ్వంతపూర్‌ నుంచి బీదర్ వెళ్లే (16571) రైలు మే 12 నుంచి మే 15వ తేదీ వరకు రద్దు

బీదర్‌ నుంచి యశ్వంతపూర్‌ (16572) వెళ్లై రైలును మే 12 నుంచి 16వ తేదీ వరకు రద్దు

దారి మళ్లించిన రైళ్ల జాబితా

తిరుపతి - అకోలా (07605/06) రైలు మే 5 నుంచి 16వ తేదీ వరకు దారి మళ్లింపు,

తిరుపతి - సికింద్రాబాద్‌ (12731/32) రైలు మే 5 నుంచి 16వ తేదీ వరకు దారి మళ్లింపు

సికింద్రాబాద్‌ - తిరుపతి (12770/69),

కాచిగూడ - మధురై (07191/92),

ముంబయి - నాగర్‌ కోయిల్‌ (16339/40),

ముంబై - త్రివేండ్రం (16331) రైళ్లను గుత్తి నుంచి కడప, రేణిగుంట మీదుగా దారి మళ్లిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories